Advertisement
Google Ads BL

‘నాని గ్యాంగ్ లీడర్’ విడుదల ఎప్పుడంటే?


నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ‘నాని గ్యాంగ్ లీడర్’ ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా బేనర్‌లో చేస్తున్న మరో విభిన్న చిత్రం ‘నాని గ్యాంగ్ లీడర్’. 14 నుండి శంషాబాద్‌లో మూడో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయింది. జూన్ 30కి టోటల్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఆగష్టు 30న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేశాం’’ అన్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఇంతకముందెన్నడూ రాని ఒక డిఫరెంట్ లుక్‌తో ఉండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ కూడా ఉంటుంది. అది ఏమిటనేది స్క్రీన్‌ పైన చూస్తేనే బాగుంటుంది. టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఉండే సినిమా ఇది’’ అన్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌

Nani Gang Leader Release Date Locked:

Nani Gang Leader Release Date Fixed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs