Advertisement
Google Ads BL

బెల్లంకొండ ఆలోచనల్లో మార్పొచ్చింది 


బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో హీరో అవతారమెత్తినప్పటినుండి... భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ.. భారీ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ టాప్ హీరోయిన్స్ తో నటిస్తే స్టార్ హీరో అవుతారని అనుకుంటే ఎంత పొరపాటు అనేది బెల్లంకొండ నటించిన సినిమాలన్నీ వరసబెట్టి చూస్తే తెలుస్తుంది. కేవలం బడ్జెట్, టాప్ హీరోయిన్స్ మాత్రమే కాదు... డైరెక్టర్స్ కూడా హేమా హేమీ డైరెక్టర్స్ తోనే సినిమాలు  చేస్తున్నాడు. అయినా హీరోగా స్ట్రాంగ్ అవడానికి నానా తంటాలు పడుతున్నాడు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ - తేజ కాంబోలో తెరకెక్కిన సీత సినిమా ఈ నెల 24 న విడుదలకాబోతుంది.

Advertisement
CJ Advs

అయితే సీత సినిమా మొత్తం హీరోయిన్ చుట్టూతానే తిరిగే కథ. తేజ ఆ సీత కథని కాజల్ కి వినిపిస్తే... ఈకథ నేను తప్ప మరెవ్వరు చెయ్యకూడదు. నేనే చేస్తానని కాజల్ ఆ సినిమా ఒప్పేసుకుంది. కానీ హీరోగా యంగ్ హీరోలెవరు ఒప్పుకోకపోయినా... బెల్లంకొండ కాజల్ అగర్వాల్ హీరోయిన్ అనగానే సై అన్నాడు. అయితే కథ మొత్తం హీరోయిన్ పాత్ర చుటూ తిరిగినా బెల్లంకొండ ఒప్పుకున్నాడు అంటే బెల్లంకొండ ఆలోచనల్లో మార్పొచ్చింది అనిపిస్తుంది. 

ఎప్పుడూ హీరోయిజం చూపించాలని తాపత్రయపడే ఈ బెల్లంకొండ మొదటిసారి హీరోయిన్ కి అధిక పాధాన్యతనిచ్చే సినిమా చేస్తున్నాడు. మరి సీత టైటిల్ మాత్రమే కాదు... సినిమాలో కాజల్ పాత్ర కూడా హైలెట్ అనేది ట్రైలర్ లోనే తెలిసింది. ఇక కాజల్ క్రేజ్ తోనే సీత సినిమా బిజినెస్ వీరలెవల్లో జరిగింది కూడా వాస్తవమే...! 

Bellamkonda Srinivas Fully Changed:

Superb Change in Bellamkonda Srinivas Mindset
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs