Advertisement
Google Ads BL

అల్లరోడుకి ఇప్పుడా సినిమానే కీలకం!


టాలీవుడ్‌లో ఈవేసవి సెలవులను, ఇతర చిత్రాల నుంచి సరైన పోటీ లేని వంటి అంశాలను మహేష్‌ ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’ బాగానే క్యాష్‌ చేసుకుంటోంది. వీకెండ్‌ అయిపోయి వీక్‌ డేస్‌ వచ్చాయి కాబట్టి ఈ వారంలో ఈ చిత్రం ఎంత వరకు కలెక్షన్లు వసూలు చేస్తుంది? మహేష్‌ కాలర్‌ ఎత్తిన సందర్భాన్ని, సంబరాన్ని నిలబెడుతుందా? ‘రంగస్థలం’ పేరు మీద ఉన్న నాన్‌ బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందా? అనేది చూడాల్సివుంది. మహేష్‌కి గట్టి పట్టు ఉన్న ఓవర్‌సీస్‌లో ఈ చిత్రం వన్‌ మిలియన్‌ మార్కుని అందుకోవడానికి చాలారోజులే తీసుకుంది. అయినా ఈ చిత్రం ఓవర్‌సీస్‌లోని బయ్యర్లకు లాభాలు తేవాలంటే రెండున్నర మూడు మిలియన్లు వసూలు చేయాల్సివుంది. మరి ఇది సాధ్యమేనా అనేది చూడాలి? ఇక మొత్తం మీద ఈ చిత్రం 100కోట్ల క్లబ్‌లో చేరిందని అంటున్నారు.

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే తాజాగా జరిగిన సక్సెస్‌మీట్‌లో ఇందులో రవిగా కీలకపాత్రను పోషించిన అల్లరి నరేష్‌ ప్రసంగం ఉద్వేగభరితంగా సాగింది. నాలుగేళ్ల పాటు సక్సెస్‌ రాలేదని, ‘మహర్షి’తో తాను గర్వపడే చిత్రంగా ఇది నిలవడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఇక ఈ చిత్రంలో అల్లరోడుది కథను కీలకమలుపు తిప్పే పాత్ర. అందునా కొన్ని సీన్స్‌లో రిషి కంటే రవి ఔన్నత్యం బాగా పండింది. నరేష్‌ పాత్ర మంచి సానుభూతిని దక్కించుకుంటూ ప్రేక్షకుల హృదయాలను టచ్‌ చేస్తోంది. అయితే ‘అర్జున్‌’ చిత్రంలో ఆనంద్‌ రాజా తరహాలో కాకుండా థియేటర్ల బయటకు వచ్చిన 10శాతం మందికి నరేష్‌ పాత్రబాగా కనెక్ట్‌ అవుతోంది. కానీ ఈ చిత్రం మహేష్‌బాబు సింగిల్‌ షో అనే చెప్పాలి. ఆయన పేరు ప్రఖ్యాతుల మీదనే ఈ చిత్రం కలెక్షన్లు నడుస్తున్నాయి. 

అదే సమయంలో ఈ మూవీలో అల్లరినరేష్‌ తనదైన కామెడీని గానీ, తనకున్న కొద్దిపాటి హీరోయిజాన్ని కాని చూపించే అవకాశం లేకుండా పోయింది. ఈ చిత్రం చూసిన అందరికీ మహేష్‌ పాత్రే గుర్తుండిపోతుంది. ఇక 55 సినిమాలలో నటించిన నరేష్‌కి ఈ చిత్రం సోలో సినిమాలలో చాన్స్‌లు రప్పించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అలాగని అన్నింటిలో ఇలాంటి కీలకపాత్రలే చేస్తూ ఉండలేడు. ప్రస్తుతం అల్లరినరేష్‌ రెండు మూడు చిత్రాలలో నటిస్తున్నాడు. ఇందులో మొదటగా ‘బంగారు బుల్లోడు’ విడుదల కానుంది. బాలయ్య-రవీనాటాండన్‌ జంటగా రవిరాజా పినిశెట్టి దర్శత్వంలో వచ్చి హిట్‌ అయిన టైటిల్‌ను వాడుకుంటున్న అల్లరోడుకి ‘బంగారు బుల్లోడు’ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సివుంది...! 

This Movie Very important to Allari Naresh:

Allari Naresh Full Hopes on Bangaru Bullodu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs