Advertisement
Google Ads BL

‘మహర్షి’లో యాడ్ చేస్తున్న సీన్లు ఇవే!


రెండున్నర గంటలు ఉన్న సినిమాను తట్టుకోవడమే చాలా ఎక్కువ పైగా మూడు గంటలు సినిమా అంటే అతి కష్టం మీద కూర్చోవాలి. సినిమాలో విషయం, కథలో గ్రిప్ ఉంటే ఎంతసేపైనా కూర్చోవచ్చు. కానీ మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమా మూడు గంటలు ఉంటే చిరాకు వచ్చేస్తుంది. అందులో అనవసరం అయిన సీన్స్ ఉంటే బోర్ కొడుతుంది. రీసెంట్ గా వచ్చినా మహర్షి సినిమా దాదాపు మూడు గంటలు ఉన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా సెకండాఫ్ చాలా ఎక్కువగా ఉందనే భావనను చాలామంది వ్యక్తంచేశారు. 

Advertisement
CJ Advs

అయితే ఇటువంటి సినిమాకు అదనంగా మరికొన్ని సన్నివేశాలు జత చేస్తే పరిస్థితి ఏంటి? సరిగ్గా అలాంటి ప్రయోగాన్నే చేయబోతోంది మహర్షి యూనిట్. ఈ వీకెండ్ లేదా ఆ తరువాత వీక్ లో మహర్షి సినిమాకు అదనంగా మరికొన్ని సన్నివేశాలు జతచేయాలని నిర్ణయించారు. సినిమాలో మహేష్ కు పూజా ఇంట్లో పెళ్లి చూపులు లాంటివి జరుగుతాయి. అక్కడ ఓ 3 నిమిషాల సీన్ ఉందట. అయితే ఎడిటింగ్ లో లెంగ్త్ ఎక్కువ అవుతుందని భావించి అప్పుడు కట్ చేసారు.

ఇప్పుడు సినిమాకు హిట్ రావడంతో ఆ సీన్ ను యాడ్ చేయాలనీ మహేష్ అండ్ టీం భావిస్తుంది. పైగా మహేష్ కు ఆ సీన్ ఫేవరేట్ అంట. అలానే సెకండ్ హాఫ్ లో మహేష్ - నరేష్ మధ్య వచ్చే ఓ సన్నివేశంతో పాటు.. రైతులతో మహేష్ మాట్లాడే మరో సీన్ ను కూడా యాడ్ చేస్తారట. అసలే సినిమా రన్ టైం ఎక్కువ అనుకుంటే ఇప్పుడు అదనంగా సీన్స్ యాడ్ చేస్తున్నారంటే సాహసమే అని చెప్పాలి.

Some More Scenes Add To Maharshi Movie:

Maharshi Team Is Going To Add Some More Scenes In Movie <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs