Advertisement
Google Ads BL

కాలర్‌ ఎగరేసి.. కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు


మహర్షి సినిమా విషయంలో మహేష్ రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. ఒక సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోతే ఆ సినిమా యొక్క హీరోకి మింగుడు పడదు. చాలా డల్ అయిపోతారు. అదేంటి ఇలా జరిగింది ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాకు రిజల్ట్ ఇలా వచ్చిందేంటి అని దిగులు పడిపోతుంటారు. అయితే ఇప్పుడు మహర్షి విషయంలో మహేష్ రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

టాక్ కు అతీతంగా కాన్ఫిడెన్స్‌ చూపిస్తూ తమ సినిమా తమకి గర్వకారణం అంటూ కాలర్‌ ఎగరేసాడు. ఇది చాలా రెగ్యులర్ సినిమా అని అందరికి తెలిసిందే. మహేష్ నటన కొత్తగా ఉంది కానీ సినిమా స్టోరీ లైన్ మహేష్ ముందు చేసిన సినిమాలలా వుందనే టాక్‌ గట్టిగా వినిపిస్తుంది.

సినిమా హిట్ అయితే ఫ్యాన్స్ కాలర్లు ఎగరేసుకోవడం కామన్. కానీ తన మూవీ హిట్ అయిందని హీరోనే కాలర్‌ ఎగరేయడం కొంచెం కొత్తే. నిజానికి మహర్షి సినిమా మహేష్‌ కాలర్‌ ఎగరేసే అంత గొప్ప సినిమానా అనే కుతూహలం స్టార్ట్‌ అయింది. కానీ మహేష్ ఎగురవేశాడు. అందుకే ఈ మూవీకి వసూళ్లు డ్రాప్‌ అవకుండా స్టడీగా సాగుతున్నాయి. మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ టాక్‌కి సంబంధం లేదు. మిక్స్డ్ టాక్ వచ్చిన మహర్షికి మహేషే కలెక్షన్స్ తెప్పిస్తున్నాడు అనడంలో అతిశయోక్తి  కాదు.

No Change in Mahesh Babu Maharshi Collections:

Talk Mixed.. but gets hit Collections 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs