Advertisement
Google Ads BL

ప్రీతి పాత్రలో కియారా ఇరగదీసేసింది


దర్శకుడు సందీప్ వంగా బోల్డ్ కంటెంట్ తో విజయ్ దేవరకొండ - షాలిని పాండేలు హీరోహీరోయిన్స్ గా పెట్టి అర్జున్ రెడ్డి అనే సినిమా తెరకెక్కించాడు. విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా కాంట్రవర్సీలకు వేదికగా మారింది. విజయ్ దేవరకొండ - హీరోయిన్ షాలిని పాండేల లిప్ లాక్స్, రొమాంటిక్ సన్నివేశాలు అర్జున్ రెడ్డి సినిమాని యూత్ కి బాగా కనెక్ట్ చేశాయి. అర్జున్ రెడ్డిగా విజయ్ ఇరగదీసాడు. విజయ్ దేవరకొండకి పోటీగా షాలిని పాండే కూడా ప్రీతి కేరెక్టర్ లో బోల్డ్ గా నటించి దుమ్మురేపింది. అర్జున్ రెడ్డి అలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో తెలుగు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా షాహిద్ కపూర్ - కియారా అద్వానీ హీరోహీరోయిన్స్ గా కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కూడా సేమ్ తెలుగు విజయ్ దేవరకొండ మాదిరిగా కబీర్ సింగ్ పాత్రలో అదరగొట్టేస్తున్నాడు. లుక్స్, యాటిట్యూడ్, స్టయిల్ అన్ని విజయ్ దేవరకొండ మాదిరిగా షాహిద్ కూడా మారిపోయాడు. తాజా పోస్టర్, కబీర్ సింగ్ ట్రైలర్ కూడా అర్జున్ రెడ్డికి మక్కికి మక్కి దింపినా కబీర్ సింగ్ ట్రైలర్ అదుర్స్ అన్న రేంజ్ లో ఉంది.

Advertisement
CJ Advs

ఇక తెలుగు అర్జున్ రెడ్డిలో ప్రీతి పాత్రని షాలిని పాండే ఎలాంటి బెరుకు లేకుండా పోషించి శభాష్ అనిపించుకుంది. ఇక తెలుగు ప్రీతి పాత్రని బాలీవుడ్ లో కియారా అద్వానీ పోషించింది. షాలినికి ఏ మాత్రం తీసిపోకుండా కియారా అద్వానీ కూడా ఆ బోల్డ్ కేరెక్టర్ లో అదరగొట్టడమే కాదు.. షాహిద్ కపూర్ తో లిప్ లాక్స్ లోను రెచ్చిపోయింది. చాలా డీసెంట్ గా నటనలో కియారా అద్వానీ నటన ఈ కబీర్ సింగ్ లో ఉంది. మరి కబీర్ సింగ్ పక్కా హిట్ అందులో షాహిదకపూర్ కి ఎంతగా పేరొస్తుందో.. కియారాకి అంతే పేరొస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే బాలీవుడ్ దర్శకనిర్మాతల కన్ను కియారా మీద పడడం ఖాయం.

Kabir Singh Trailer Released:

Good Response to Kiara Role in Kabir Singh Trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs