Advertisement
Google Ads BL

‘ఫలక్‌‌నుమా దాస్‌’ ట్రైలర్‌ అదిరింది: వెంకీ


‘ఫలక్‌ నుమా దాస్‌’ ట్రైలర్‌ చాలా బాగుంది, సినిమా బ్లాక్‌బ్లస్టర్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను - విక్టరీ వెంకటేష్‌ 

Advertisement
CJ Advs

‘వెళ్ళిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి చిత్రాలలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు విశ్వక్‌ సేన్‌. ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌ నుమా దాస్‌’. డి. సురేష్‌ బాబు సమర్పణలో వన్మయి క్రియేషన్స్‌ బేనర్‌ పై విశ్వక్‌ సేన్‌ సినిమాస్‌, టెరనోవ పిక్చర్స్‌, మీడియా9 క్రియేటివ్‌ వర్క్స్‌ అనుసంధానంతో పూర్తిగా హైదరాబాద్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సలోని మిశ్రా, హర్షిత గౌర్‌, ప్రశాంతి హీరోయిన్స్‌గా నటించారు. ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ పోలీస్‌ అధికారిగా కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం మే 13న హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యి సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.... 

హీరోయిన్‌ ప్రశాంతి మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాలో కీలకపాత్రలో నటించే అవకాశం ఇచ్చిన విశ్వక్‌ సేన్‌ గారికి థాంక్స్‌. అలాగే ఈ బ్యానేర్‌లో పనిచేయడం సంతోషంగా ఉంది. ట్రైలర్‌ విడుదల చేసిన వెంకీ సర్‌కి థాంక్స్‌. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్‌’’ అన్నారు. 

హీరో, దర్శకుడు విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ - ‘‘ట్రైలర్‌ కట్‌ చేసినప్పుడు చాలా భయంగా అనిపించింది. టీజర్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌కి అంతకన్నా ఎక్కువ రెస్పాన్స్‌ రావాలి అని అనుకున్నాను. అలాగే మంచి రెస్పాన్స్‌ వస్తుంది. మొన్నటిదాకా నాకు కొంత టెన్షన్‌ ఉండే... ఇంకా సినిమా ఎవ్వరికీ చూపించలేదని... సినిమా బాగుందని నాకు తెలుసు. అయినా ఎక్కడో కొంత భయం ఐతే ఉంది. అయితే రీసెంట్‌గా సురేష్‌ సర్‌ సినిమా చూసి మంచి కాంప్లిమెంట్స్‌ ఇవ్వడమే కాదు ఈ సినిమాని ప్రెజంట్‌ కూడా చేస్తున్నారు. అలాగే వెంకటేష్‌గారు చాలా సెలెక్టివ్‌ పర్సన్‌. ఆయనది గోల్డెన్‌ హ్యాండ్‌. వెంకీ సర్‌ని అడగంగానే ఓకే అన్నారు. చాలా సంతోషం వేసింది. కొంత ఎమోషనల్‌ కూడా అయ్యాను. ఇంకో రెండు రోజుల్లో రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేయబోతున్నాము’’ అన్నారు. 

నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ - ‘‘ఆల్రెడీ అందరూ టీజర్‌ చూశారు. మాది వణ్మయి ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ. అక్కడి నుండి బాబు కోసం ఫిలిం నగర్‌ వచ్చి వణ్మయి క్రియేషన్‌ను స్థాపించాను. సినిమా అద్భుతంగా వచ్చింది. 20 నుంచి 25 సంవత్సరాల వయసుండే 40 మంది కుర్రాళ్లంతా కష్టపడి వర్క్‌ చేశారు. నేచురల్‌గా రావాలని అడ్వాన్స్‌ టెక్నాలజీతో చేశారు. హైదరాబాద్‌లో ఇలాంటి ఏరియాలు కూడా ఉన్నాయని ఎవరికీ తెలియనటువంటి 118 బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరించాం’’ అన్నారు.

ముఖ్య అతిధి విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ - ‘‘టీజర్‌ చూడగానే తెలిసిపోయింది.. అందరూ రియల్‌ 40 మంది కొత్త కుర్రాళ్లు ఒక ఛాలెంజ్‌గా తీసుకొని చాలా కష్టపడి నటించారు. అలాగే సినిమాలో చాలా పాజిటివ్‌ ఎనర్జీ ఉంది. ఇక విశ్వక్‌ ప్రతి ఫ్రేమ్‌లోనూ తన యాక్టింగ్‌ స్కిల్స్‌ని అద్భుతంగా చూపించారు. ట్రైలర్‌ చాలా బాగుంది. టీం అందరూ వండ్రఫుల్‌గా చేశారు. రీసెంట్‌ టైంలో ఇంతలా యూత్‌కి నచ్చేలాంటి పిక్చర్‌ రాలేదు. హైదరాబాద్‌లోని రియల్‌ రస్టిక్‌ లొకేషన్స్‌ అన్ని కవర్‌ చేశారు. డైలాగ్స్‌ కూడా చాలా బాగున్నాయి. స్క్రిప్ట్‌ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని, ఈ టీం అందరికీ మంచి భవిష్యత్‌ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. 

ఈ కార్యక్రమంలో కో- ప్రొడ్యూసర్ మనోజ్ కుమార్ పాల్గొన్నారు.

విశ్వక్‌ సేన్‌, తరుణ్‌, సలోని మిశ్రా, హర్షిత గౌర్‌, ప్రశాంతి, ఉత్తేజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్‌: వివేక్‌ సాగర్‌, సినిమాటిగ్రఫీ: విద్యాసాగర్‌, ఎడిటర్‌: రవితేజ, లిరిక్స్‌: కిట్టు విస్సాప్రగడ, భాస్కర్‌భట్ల, సుద్దాల అశోక్‌ తేజ, ఆర్ట్‌: అఖిల పెమ్మసాని, తరుణ్‌, వినోద్‌, కో-ప్రొడ్యూసర్‌: 

మాణిక్ రావు, మనోజ్ కుమార్  ప్రొడ్యూసర్‌: కరాటే రాజు, దర్శకత్వం: విశ్వక్‌ సేన్‌

Falaknuma das Trailer released:

Victory Venkatesh Releases Falaknuma das Trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs