Advertisement
Google Ads BL

‘కల్కి’కి భలే టైమ్ సెట్టయింది


చాన్నాళ్లుగా హిట్ అనే పదానికి మొహం వాచిపోయిన రాజశేఖర్‌కి పిఎస్వీ గరుడవేగ సూపర్ హిట్ అయ్యి, రాజశేఖర్‌ని మళ్లీ నిలబెట్టింది. ఆ సినిమా విజయంతో మళ్ళీ ఎంతో ఉత్సాహంతో కల్కి సినిమా చేసాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా టీజర్, ట్రైలర్‌లు సినిమా మీద మంచి అంచనాలు పెరిగేలా చేశాయి. ఇప్పటికే కల్కి బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది. 70వ దశకంలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో రాజశేఖర్ పోలీస్ క్యారెక్టర్ చేశాడు. ఇక కల్కి సినిమా విడుదలకు రాజశేఖర్ మంచి టైం ఎంచుకున్నాడు. వేసవి సెలవలు ఇంకా పది రోజులు ఉండగానే తన సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేసాడు.

Advertisement
CJ Advs

కల్కి ట్రైలర్ లో తనని తానే ఇమిటేట్ చేసుకున్న రాజశేఖర్ సినిమా మీద మంచి హైప్ పెంచాడు. ఇక వేసవి సెలవల్లో విడుదలైన సినిమాలకు ఎలాంటి టాక్ వచ్చినా సినిమా కి కలెక్షన్స్ బావుంటాయి. అందుకే కల్కి ని మే 31న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాములుగా అయితే మే 31న విజయ్ దేవరకొండ తన డియర్ కామ్రేడ్ విడుదల చేస్తున్నట్లుగా మొదట్లో అనౌన్స్ చేసినా... తరవాత జులై 30 కి తన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. 

ఇక రాబోయే శుక్రవారం అల్లుశిరీష్ ఏబీసీడీ, అర్జున్ సురవరం.. అలాగే మే 24న బెల్లంకొండ శ్రీనివాస్ - కాజల్ ల సీత సినిమాలు విడుదలవుతున్నాయి. ఇక ఈ సినిమాలకు ఎంతగా హిట్ టాక్ వచ్చినా కల్కి కి ఈ వేసవిసెలవలు కలిసొస్తాయి. అందులోను సినిమాకి పాజిటివ్ బజ్ కూడా ఉంది. ఆ క్రేజ్ తోనే మంచి కల్లెక్షన్స్ కల్కి కి రావడం పక్కా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి కేవలం 10 కోట్ల బడ్జెట్ లో సినిమాని పూర్తి చేసిన నిర్మాతలకు ఈ కల్కి‌తో మంచి లాభాలు రావడం ఖాయమంటున్నారు. 

Kalki Movie Release Date Fixed:

Kalki Movie Release on May 31st
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs