Advertisement
Google Ads BL

ఇంతకీ ‘వెంకీమామ’ కథాంశం ఏమిటి?


నిజజీవితంలో స్వయంగా మేనమామ, మేనల్లుడు అయిన విక్టరీ వెంకటేష్‌ అక్కినేని నాగచైతన్యలు కలిసి ఫుల్‌లెంగ్త్‌ రోల్‌లో ‘వెంకీమామ’లో నటిస్తున్నారు. గతంలో ‘ప్రేమమ్‌’ చిత్రంలో వెంకీ ఓ కామియో పాత్ర చేశాడు. కానీ ‘వెంకీమామ’లో మాత్రం వారిద్దరు పూర్తిస్థాయిలో స్క్రీన్‌ని షేర్‌ చేసుకోనున్నారు. ఇక ఈ చిత్రం టైటిల్‌ చూస్తే ఇదేదో ఫ్యామలీ ఎంటర్‌టైనర్‌ అనే భావన కలగడం సహజం. ఎఫ్‌2 లాగే ఈ చిత్రం కూడా హిలేరియస్‌ కామెడీతో ఉంటుందని పలువురు అనుకుంటున్నారు. ఎఫ్‌2 వంటి భారీ విజయం తర్వాత వెంకీకి వచ్చిన రెస్పాన్స్‌ని చూసి ఇందులో కూడా వెంకీ పాత్రకు బాగా కామెడీ ఉండేలా మార్పులు చేర్పులు జరిగాయట. 

Advertisement
CJ Advs

ఇటీవల ఈచిత్రం కోసం రాజకీయ మీటింగ్‌కి సంబంధించిన సీన్స్‌ని తీశారనే వార్తలు వచ్చాయి. మరోవైపు ఇందులో నాగచైతన్య మిలటరీ అధికారిగా నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్‌ కోసం దర్శకుడు బాబి హిమాలయ పర్వతాలను, అక్కడి మిలటరీ క్యాంప్‌లను ఎంపిక చేసుకునే పనిలో ఉన్నాడు. ఇదే షెడ్యూల్‌లో ఓ పాటను కూడా చిత్రీకరిస్తారని సమాచారం. 

అయితే నాగచైతన్య ఇందులో మేనల్లుడుగా మిలిటరీ ఆఫీసర్‌ అయితే వెంకీ పాత్ర ఏమిటి? అనేది సస్పెన్స్‌గా మారింది. రాజకీయ సభ సన్నివేశాలు, మిలటరీ క్యాంపుసీన్స్‌ తీయడం చూస్తుంటే ఇదేదో రాజకీయాలు, దేశభక్తి, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి పలు అంశాలను టచ్‌ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక ‘మజిలీ’ తో చైతు భారీ హిట్‌ కొట్టాడు. మరోవైపు వెంకీ ఎఫ్‌ 2 వంటి బ్లాక్‌బస్టర్‌లో నటించాడు. బాబి జైలవకుశ వంటి చిత్రం ద్వారా ఎంతో గ్యాప్‌ తీసుకుని ఈ చిత్రం చేస్తున్నాడు. మరి దసరాకి విడుదల ప్లాన్‌ చేస్తోన్న ఈ చిత్రం ఎంతటి విజయం సాధిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Venky Mama in Full Speed:

What is the Venkymama Movie Story?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs