Advertisement
Google Ads BL

చివరికి ఆ దర్శకుడితో నాని ధైర్యం చేస్తున్నాడు


కొందరు దర్శకులు ఎన్ని హిట్స్‌ ఇచ్చినా ఒకే ఒక్క ఫ్లాప్‌ వచ్చిందంటే మరలా చాన్స్‌ల కోసం కాళ్లరిగిపోయేలా తిరగాల్సిందే. అందునా మహేష్‌బాబు వంటి సూపర్‌స్టార్‌, పివిపి వంటి బేనర్‌ కలిసి శ్రీకాంత్‌ అడ్డాల చేతిలో బ్రహ్మూెత్సవం చిత్రాన్ని పెట్టాయి. ఫుల్‌ స్క్రిప్ట్‌ చేతిలో లేకుండా షూటింగ్‌ స్పాట్‌లో సన్నివేశాలను రాసుకుంటూ తీసిన ఈ చిత్రం దారుణమైన ఫలితాన్ని అందుకుంది. మహేష్‌ బాబు మాత్రం ఆ దెబ్బ నుంచి కోలుకున్నా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మాత్రం అడ్డంగా బుక్కయ్యాడు. నిజానికి శ్రీకాంత్‌ అడ్డాల కృష్ణవంశీ తరహాలో తెర నిండా నిండుతనం కనిపించేలా ఆర్టిస్టులతో ఫ్యామిలీ చిత్రాలు, సెన్సిబుల్ చిత్రాలు బాగా తీస్తాడనే పేరుంది. మొదటి చిత్రం కొత్తబంగారు లోకం, తదుపరి మహేష్‌, విక్టరీ వెంకటేష్‌లతో కలిసి మరోసారి మల్టీస్టారర్‌కి ఊపిరిలూదుతూ తీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు రెండు భారీ విజయాలను అందుకున్నాయి. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ ముకుంద తీస్తే అది ఫర్వాలేదనిపించింది. కానీ బ్రహ్మూెత్సవం పీడకల మాత్రం ఈయన్ను వెంటాడుతూనే ఉంది. చివరకు శ్రీకాంత్‌ అడ్డాలకు ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్‌ ఓ చాన్స్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని తన కుమారులతో తీసే ధైర్యం చేయలేక ఆయన శ్రీకాంత్‌ అడ్డాలకు హీరోలను ఒప్పించే బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. చివరకు శ్రీకాంత్‌ అడ్డాల స్టోరీకి నేచురల్‌ స్టార్‌ నాని ఓకే చెప్పాడట. ప్రస్తుతం నాని విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో గ్యాంగ్‌లీడర్‌ చిత్రం చేస్తున్నాడు. 

ఆ తదుపరి చిత్రంగా దిల్‌రాజుతో కలసి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబుతో పాటు నాని వి అనే చిత్రంలో నటించనున్నాడు. వీటి తదుపరి నాని చేసే చిత్రం శ్రీకాంత్‌ అడ్డాలదేనని అనుకోవచ్చు. గతంలో ఏ దర్శకుడు ఎదుర్కోనటువంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రంతో దాని నుంచి బయట పడటమే కాదు.. జెర్సీ వంటి హిట్‌ చిత్రాలు కూడా లాభాలు ఆర్జించలేకపోతున్న నానికి బలమైన భలే భలే మగాడివోయ్‌ వంటి హిట్‌ని ఇవ్వాల్సివుంటుంది.

Nani Green Signal to Flop Director:

Nani and Srikanth Addala Film Soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs