Advertisement
Google Ads BL

ఓవర్సీస్‌లో ‘మహర్షి’ ఇంపాక్ట్ లేదేంటి?


సినిమాల పరంగా నైజాం తరువాత అంతటి పెద్ద మార్కెట్ ఓవర్సీస్. ఇక్కడ మన తెలుగు సినిమాలు అన్ని దాదాపుగా రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా యుఎస్‌ దేశాల్లో మన తెలుగు సినిమాలు చాలా సార్లు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాయి. అయితే అది మొన్నటివరకు. ఈమధ్య అలా లేదు. ఎలాంటి ఫౌండేషన్‌ లేకుండా కేవలం ఆఫర్లు, ఫ్రీ పాస్‌లు నేపథ్యంలో బిల్డ్‌ అయిన ఓవర్సీస్‌ బిజినెస్‌ ఎంపైర్‌ బీటలు వారుతోంది. 

Advertisement
CJ Advs

యుఎస్‌ లో ఒక ఆఫర్ ఉంది. అక్కడ ఒక పాస్ ఉంటే ఎన్ని సినిమాలైనా చూడొచ్చు. ఈ ఆఫర్ మన తెలుగువారంతా తెగ వాడేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ ఆఫర్స్ యుఎస్‌ గవర్నమెంట్ ఎత్తేసింది టాక్. అందుకే కలెక్షన్స్ పరంగా మార్కెట్ డల్ గా ఉందని చెబుతున్నారు యుఎస్‌ ట్రేడ్‌. మహర్షి సినిమాకి ప్రీమియర్ల పరంగా కేవలం అర మిలియన్‌ డాలర్లు రావడం ఇందుకు నిదర్శనం అని అర్ధం అయిపోయింది. స్పైడర్ లాంటి మూవీకే మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన మహేష్‌ ‘మహర్షి’కి ఎందుకు కలెక్షన్స్ రావడంలేదంటే ఇదే కారణం.

మొన్న జెర్సీకి మంచి టాక్ ఉన్న కానీ వసూళ్లు చాలా మామూలుగానే వచ్చాయి. ఇప్పుడు మహర్షి పరిస్థితి కూడా అంతే. ఓవర్సీస్ కింగ్ అనుకునే మహేష్ సినిమాకే బిజినెస్ ఇంత పడిపోయిందంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. సో ఇకపై ఇందుకు తగ్గట్టుగా ఇక్కడి బిజినెస్‌ని అడ్జస్ట్‌ చేసుకోవాల్సి వస్తుందని అక్కడ బయ్యర్లు విశ్లేషిస్తున్నారు.

Maharshi US Numbers Not Up to the Mark:

Maharshi US Numbers Worrying!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs