Advertisement
Google Ads BL

‘మహర్షి’ రవి కెరీర్ సెట్ అయినట్లేనా..?


ఒకప్పుడు కామెడీ హీరోగా... బెస్ట్ ఇచ్చిన అల్లరి నరేష్.. రాను రాను చెత్త సినిమాలు చెయ్యడంతో.. గత కొన్నాళ్లుగా హిట్ అనే పదాన్నే మరిచిపోయాడు. కెరీర్ మొదటి నుండి కామెడీ హీరోగానే సినిమాలు చేసిన అల్లరి నరేష్... ఇప్పటి వరకు ఎమోషనల్ సినిమాల జోలికి పోలేదు. కానీ హీరోగా కెరీర్ ముగుస్తున్న టైంలో మహేష్ బాబు సినిమాలో మంచి ఆఫర్ రావడంతో ఆ కేరెక్టర్ నచ్చి ఓకే చెప్పేసిన అల్లరి నరేష్ కి మహర్షి మంచి ఫలితాన్నే ఇచ్చింది. రవి పాత్రలో మహేష్ ఫ్రెండ్ గా అల్లరి నరేష్ ఆకట్టుకున్నాడు. చాలా రోజుల తర్వాత అల్లరి పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. మహర్షిలో ఆ కాలేజ్ కి ఎపిసోడ్ కి అంతగా పేరు రావడానికి అల్లరి కామెడీ కారణమనే చెప్పాలి. మహేష్, పూజాహెగ్డేలతో ఫ్రెండ్ షిప్ చేస్తూ మహేష్ కోసం త్యాగం చేసే రవి పాత్రకి అల్లరి నరేష్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.

Advertisement
CJ Advs

రైతు బిడ్డగా రవి పాత్రలో అద్భుతమైన నటనను అల్లరి ప్రదర్శించాడు. ఊరికోసం, స్నేహితుడి కోసం జీవితాన్నే త్యాగం చేసిన భావోద్వేగ సన్నివేశాల్లో అల్లరి నరేష్ నటన అదుర్స్. రవి పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అల్లరి నరేష్ కెరీర్లో చాలాకాలం గుర్తుండిపోయే పాత్ర ఇది. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఒక దశలో చాలా ప్రాధాన్యంతో కనిపించే రవి క్యారెక్టర్.. తర్వాత సైడ్ అయిపోతుంది. అల్ల్లరి నరేష్ పాత్రకి దర్శకుడు వంశి పైడిపల్లి సరైన ముగింపు ఇవ్వలేదు. మరి ఈ ఇలాంటి కేరెక్టర్స్ కి అల్లరి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని... మిగతా దర్శకులు కూడా స్టార్ హీరోల సినిమాలో కీలకపాత్రలు అల్లరి పేరుని ఖచ్చితంగా పరిశీలించడం ఖాయమంటున్నారు. మరి హీరోగా కెరీర్ డల్ అయిన అల్లరికి మహర్షి ఎంతవరకు మేలు చేస్తుందో చూద్దాం.

Good Response to Allari Naresh Role in Maharshi:

Allari Naresh gets hit with Maharshi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs