Advertisement
Google Ads BL

‘మహర్షి’ పై బాలీవుడ్‌, కోలీవుడ్ కన్ను!


తెలుగులో మంచి జడ్జిమెంట్‌ ఉన్న నిర్మాతగానే కాదు.. థియేటర్లు, టిక్కెట్ల రేట్లు, బెనిఫిట్‌ షోలు ఇలా ప్రభుత్వాల నుంచి అనుమతి తెచ్చుకుని లాబీయింగ్‌ చేయడంలో దిల్‌రాజుకి మంచి పేరుంది. అల్లుఅరవింద్‌ తర్వాత స్థానం ఆయనదేనని చెప్పాలి. కాగా ప్రస్తుతం దిల్‌రాజు బాలీవుడ్‌ చిత్ర రంగంవైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈయన తీసిన ‘ఎఫ్‌ 2’ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో వెంటనే ముంబైలో ప్రముఖుల కోసం స్పెషల్‌ స్క్రీనింగ్‌ వేశాడు. ఈచిత్రాన్ని చూసిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ దీనిని బాలీవుడ్‌లోకి రీమేక్‌ చేస్తానని ప్రకటించాడు. అనీష్‌బజ్మీ దర్శకత్వంలో ‘ఎఫ్‌ 2’ చిత్రాన్ని బోనీకపూర్‌తో కలిసి దిల్‌రాజు సంయుక్తంగా నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక ‘మహర్షి’ చిత్రంపై మొదటి నుంచి దిల్‌రాజు ఎంతో నమ్మకంగా, కంటెంట్‌. యూనివర్శల్‌ అప్పీల్‌ ఉన్న స్టోరీగా ఎంతో నమ్మకం ఉంచుతున్నాడు. మరి ఈ చిత్రం ఎంతటి విజయం సాధిస్తుంది? ఎంత లాంగ్‌రన్‌తో లాభాలు తెచ్చిపెడుతుంది? అనే విషయాలు మరికొంత కాలం ఆగితే కానీ తెలియవు. ఇప్పుడు ‘మహర్షి’ని బాలీవుడ్‌లో కూడా రీమేక్‌ చేయాలని దిల్‌రాజు ఉబలాటపడుతున్నాడు. 

ఈ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌తో పాటు ప్రభుదేవా కలిసి వీక్షించనున్నారు. గతంలో మహేష్‌ నటించిన ‘పోకిరి’ చిత్రం ఇదే కాంబినేషన్‌లో వచ్చి 100కోట్లు కొల్లగొట్టిన చిత్రంగా నిలిచింది. మరోవైపు ‘మహర్షి’ పూర్తి స్థాయి రిజల్ట్‌ కోసం కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ కూడా ఆసక్తిని చూపిస్తున్నాడని తెలుస్తోంది.

Bollywood, Kollywood eye on Tollywood Maharshi:

Salman Khan, Vijay Wants Maharshi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs