Advertisement
Google Ads BL

వెకేషన్స్‌ని భలే ఎంజాయ్‌ చేస్తున్నారు!


తండ్రి నాగార్జున అటు సినిమాలు, ఇటు నాగచైతన్య, అఖిల్‌ల సినీ కెరీర్‌, కోడలు సమంతకి గైడ్‌లైన్స్‌, వ్యాపారాలు, బిగ్‌బాస్‌, మీలో ఎవరు కోటీశ్వరుడు, కళ్యాణ్‌ జ్యుయెలర్స్‌, ఘడీ డిటర్జెంట్‌, మరో వైపు బాలీవుడ్‌లో ‘బ్రహ్మాస్త్ర’ వంటి చిత్రాలు చేస్తూనే వీలున్నప్పుడల్లా వెకేషన్స్‌కి వెళ్లి ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తూ ఉంటాడు. అవే లక్షణాలు ఆయన పెద్దకుమారుడు నాగచైతన్యలో కూడా వచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఏదైనా చిత్రం షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే, లేదా ఓ చిత్రం విడుదలై ఫలితం తెలిసిన వెంటనే నాగచైతన్య కూడా తన శ్రీమతి సమంతతో వెకేషన్స్‌కి వెళ్తు ఫ్యామిలీలైఫ్‌ని కూడా బాగా ఎంజాయ్‌ చేస్తూ వస్తున్నాడు. 

Advertisement
CJ Advs

తాజాగా నాగచైతన్య- సమంత పెళ్లి తర్వాత కలిసి నటించిన మొదటి చిత్రం ‘మజిలీ’ మంచి విజయం సాధించింది. దాంతో నాగచైతన్య, సమంతలు కలిసి స్పెయిన్‌కి సమ్మర్‌ వెకేషన్స్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన సెల్ఫీలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలు రచ్చ రేపుతున్నాయి. కారణం.. ఇంతకాలం ఎప్పుడు కనిపించని విధంగా నాగచైతన్య ఈ ఫొటోలలో చొక్కాలేకుండా తన బాడీని చూపిస్తూ ఉన్నాడు. ఈ స్టిల్‌ ఆయనకున్న మహిళా అభిమానులకు మంచి కిక్‌ ఇస్తోంది. ఇక సమంత అయితే బ్లాక్‌బికినీలో దర్శనమిస్తోంది. సెల్ఫీ కాబట్టి ఇంకా పూర్తిగా సెక్సీగా అనిపించే యాంగిల్‌ లేదు గానీ మొత్తానికి ఆమె తన మగ అభిమానులకు ఈ ఫొటో ద్వారా ట్రీట్‌ ఇస్తోందనే చెప్పాలి. 

కాగా ప్రస్తుతం నాగచైతన్య, విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీ మామా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ నుంచి ఆయన కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. మరోవైపు సమంత, నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబీ’ చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. త్వరలో తమిళ రీమేక్‌ ‘96’ షూటింగ్‌లో జాయిన్‌ కానుంది. మొత్తానికి ఈ సెల్ఫీలో నాగచైతన్య నవమన్మధునిగా, గ్రీకువీరుడిలా కనిపిస్తూ ఉంటే సమంత రతీదేవిని తలపిస్తోందనే చెప్పాలి. 

Samantha and Chaitu Enjoys at Vacation:

Samantha and Naga Chaitanya Shares their photos in Tour
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs