సూపర్ స్టార్ మహేష్ బాబు పర్సనల్ లైఫ్‌లో భార్య పిల్లలతో ఎంతగా సంతోషంగా ఉంటాడో... కెరీర్‌లో తనతో పనిచేసే సినిమా యూనిట్ అందరితోనూ అంతే మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. ఇక తన సినిమా ఈవెంట్స్ జరిగాక సినిమా యూనిట్ లోను ముఖ్యమైన వాళ్లకు తన ఇంటిదగ్గరే మంచి పార్టీ ఆరెంజ్ చెయ్యడం మహేష్ కి అలవాటు. గత ఏడాది ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగాక ఎన్టీఆర్, రామ్ చరణ్, సందీప్ వంగా, కొరటాల శివ, వంశీ పైడిపల్లి లాంటి ప్రముఖులకు మహేష్ తన ఇంట్లోనే పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తన సినిమా ఈవెంట్ అవ్వగానే తన ఇంటికే పిలిచి పార్టీ ఇవ్వడం అనేది మహేష్‌కి ఆనవాయితీగా మారింది.
తాజాగా మహర్షి సినిమా విడుదలై సక్సెస్ సాధించినందుకు గాను మహేష్ మరోసారి తన ఇంట్లో పార్టీ చేసుకుని మరీ ఎంజాయ్ చేసాడు. గత ఏడాది ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో పార్టీలో ఎంజాయ్ చేసిన మహేష్ బాబు.. ఈసారి విజయ్ దేవరకొండతో పార్టీ చేసుకున్నాడు. మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఇక సందీప్ వంగా తో మహేష్. విజయ్ దేవరకొండ సినిమాని నిర్మిస్తారని ప్రచారం జరుగుతున్నవేళ విజయ్ దేవరకొండ పదే పదే మహేష్ ని కలవడం మాత్రం ఆశ్చర్యకరంగానే ఉంది.
ఇక మహర్షి విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సందర్భంగా మహేష్ ఏర్పాటు చేసిన ఆపార్టీలో విజయ్ దేవరకొండ, దిల్ రాజు, మహర్షి హీరోయిన్ పూజా హెగ్డే, మహేష్ వైఫ్ నమ్రత, అశ్వినీదత్, పీవీపీ, వంశి పైడిపల్లి లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఇక నిన్న(మే9) గురువారం విజయ్ దేవరకొండ బర్త్ డే కూడా ఈ పార్టీకి కలిసొచ్చింది. మరి మహేష్ ఇచ్చిన పార్టీలో అందరూ ఎంజాయ్ చెయ్యడమే కాదు... ఫొటోస్, సెల్ఫీస్ తో అదరగొట్టేశారని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫొటోస్ చూస్తుంటే తెలుస్తుంది.