Advertisement
Google Ads BL

ఈ జంట మందు తాగి రాత్రంతా కలిసి గడిపారట!


టాలీవుడ్‌ సంగతి.. దక్షిణాది సినిమా పరిశ్రమ సంగతి పక్కనపెడితే బాలీవుడ్‌ నటీనటులు తమ చిత్రాల మీద ఆసక్తి కలిగించేందుకు ఎంతటి అబద్దాలైనా ఇట్టే చెబుతారు. వాటిల్లో నిజాలు కూడా ఉంటాయి. కానీ వారే దక్షిణాదిలో ఉన్నప్పుడు అలాంటి పుకార్లు వచ్చినా మండిపడతారు. ఇక విషయానికి వస్తే బొడ్డు సుందరి తాప్సి ఎంతో కాలం దక్షిణాదిలో ప్రయత్నించి వరుస అవకాశాలనైతే రాబట్టుకుంది గానీ సరైన హిట్టుని మాత్రం సాధించలేదు. కానీ బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ మాత్రం చెప్పుకోదగిన హిట్స్‌ని పొందుతూ స్టార్‌ స్టేటస్‌ దిశగా అడుగులు వేస్తోంది. ఆ మధ్య రాఘవేంద్రరావుని వెకిలిగా మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకుల ఆగ్రహానికి గురైంది. 

Advertisement
CJ Advs

తాజాగా ఈమె బాలీవుడ్‌లో విక్కీకౌశల్‌తో కలిసి ‘మన్మర్జియాన్‌’లో నటిస్తోంది. ఇందులో అమితాబ్‌బచ్చన్‌ కూడా కీలకపాత్రను పోషిస్తున్నాడు. అదేమి అదృష్టమోగానీ తాప్సికి అమితాబ్‌ నటించే చిత్రాలలో బాగానే ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా తాప్సి, విక్కీకౌశల్‌లు కలిసి ఓ టాక్‌షోలో పాల్గొన్నారు. ఆ టాక్‌ షోలో తాప్సి మాట్లాడుతూ.. ‘మన్మర్జియాన్‌’ షూటింగ్‌ పూర్తి అయిన ఓ రోజున ఓ హోటల్‌లో పార్టీ చేసుకున్నాం. ఆ పార్టీలో నేను, విక్కీకౌశల్‌ ఇద్దరం బాగా మందు తాగాం. రాత్రి బాగా పొద్దుపోయాక నాకు అక్కడి నుంచి బయటకు వెళ్లాలని అనిపించలేదు. ఇద్దరం కలిసి అక్కడే ఉండాలనుకున్నాం. మేము పార్టీ చేసుకున్న ఆ హోటల్‌ గార్డెన్‌లో మేమిద్దరం కలిసి పడుకున్నామని చెప్పుకొచ్చింది.

హీరో విక్కీకౌశల్‌ ఈ సంఘటన గురించి మాట్లాడుతూ, పార్టీ ముగిసిన తర్వాత అక్కడే ఉందామని తాప్సి పట్టుబట్టింది. ఆమెకి ఆ హోటల్‌ గార్డెన్‌ ఎంతగానో నచ్చింది. అందుకే వెళ్లిపోవడానికి ఆమెని ఎంతగా ఒప్పించినా నో చెప్పింది. దాంతో రాత్రంతా మేమిద్దం అక్కడే ఉండాల్సివచ్చింది. అయితే గార్డెన్‌లో కేవలం కబుర్లు చెబుతూ గడిపామని తెలిపాడు. ఈ వార్త ఇప్పుడు బిటౌన్‌లో సంచలనంగా మారింది. ఇది నిజంగా చెప్పిందేనా? పబ్లిసిటీ కోసమా? ఇద్దరు ఏకాంతంగా కేవలం కబుర్లకే పరిమితమయ్యారా? అంటూ పలు ప్రశ్నలు బిటౌన్‌వారిని వేధిస్తున్నాయి. 

Hero, Heroine Revealed top Secret :

Taapsee Pannu and Vicky Kaushal share woozy moments! 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs