Advertisement
Google Ads BL

ఆ డైరెక్టర్, హీరోకి మధ్య కూడా గొడవలా?


హీరో - డైరెక్టర్ మధ్య బాండింగ్ కరెక్ట్‌గా ఉంటేనే ఆ సినిమా అవుట్ ఫుట్ నీట్ గా బయటకు వస్తుంది. ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా ఉండాలి. ఎక్కడో చోట ఇద్దరి మధ్య డిఫరెన్స్ రావడం ఈమధ్య కాలంలో మాములు అయిపోయింది. కొంతమంది హీరోస్ అండ్ డైరెక్టర్స్ అయితే మా సినిమా షూటింగ్ పిక్నిక్‌లా జరిగిందని.. అంతా ఫ్రెండ్స్‌లా కలిసిపోయి పని చేశామని చెబుతారు. కానీ అది కొన్ని సినిమాలకి మాత్రమే జరుగుతుంది.

Advertisement
CJ Advs

అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకూ అంటే సూర్య తాజా చిత్రం ‘ఎన్‌‌జికె’ ఇలాంటి క్రియేటీవ్ డిఫ‌రెన్స్ బారీన ప‌డిన‌ట్టు చెన్నై వ‌ర్గాల టాక్‌. డైరెక్టర్ అండ్ హీరో మధ్య షూటింగ్‌లో క్రియేటీవ్ డిఫ‌రెన్స్ వచ్చిందని అందుకే డైరెక్టర్ సెల్వ రాఘ‌వ‌న్ సినిమా షూటింగ్ చివరిలో వదిలి వెళ్లిపోయాడని టాక్ నడుస్తుంది.

సెట్లో సూర్య – సెల్వ మ‌ధ్య విబేధాలు వ‌చ్చాయ‌ని, దాంతో సెల్వ అలిగి షూటింగ్‌కి డుమ్మా కొట్టాడని అందుకే ఇప్పుడు ప్రమోషన్స్ కూడా రావట్లేదని చెబుతున్నారు. ఇప్పుడు సెల్వ రాఘ‌వ‌న్ లేకుండానే సినిమా బ‌య‌ట‌కు వ‌స్తోంద‌ని తెలుస్తోంది. ఈనెల 29 న ఈసినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. మరి ఇప్పుడు జరిగే ప్రమోషన్స్ కైనా సెల్వ వస్తాడా లేదా అనేది తెలియాల్సిఉంది. అసలే సెల్వ సినిమాలు సరిగా ఆడడంలేని టైం లో ఈ పత్తి వ్యాపారం ఏంటో....

Creative Differences Between Director and Star Hero:

War between Selva Raghavan and Surya about NGK
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs