Advertisement
Google Ads BL

రాజమౌళి తప్పే.. ఆర్ఆర్ఆర్ ఆగడానికి కారణం?


సినిమాల్లో నటించాలంటే హీరోస్ కి ఫిట్నెస్ చాలా అవసరం. ఎందుకంటే సినిమాల్లో ఫైట్స్ చేసేటప్పుడు ఏమి ఇబ్బంది రాకుండా ఉండాలి కాబట్టి మన హీరోస్ దాదాపుగా ఫిట్ గానే ఉంటారు. సీనియర్ హీరోస్ తప్ప. రాజమౌళి సినిమాలంటే హీరోస్ కి ఫిజికల్‌ శ్రమ తప్పదు.  బాహుబలి లాంటి సినిమాకి ఉన్నపళంగా షూటింగ్‌కి వెళ్లిపోతే హీరో, విలన్‌ వల్ల అవదు. 

Advertisement
CJ Advs

అందుకే ప్రభాస్, రానా ఇద్దరూ ఫిజికల్‌గా కఠోర శ్రమ పడి, ఆ చిత్రానికి యుద్ధ సన్నద్ధులై షూటింగ్‌కి వెళ్లారు. ఇప్పుడు రాజమౌళి RRR చిత్రం కోసం ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫిట్‌నెస్‌పై అంత కేర్ తీసుకోలేదు. స్టోరీకి ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే కరెక్ట్ అనుకున్నారేమో కానీ ఎలాంటి గోల్స్‌ పెట్టకుండా సరాసరి షూటింగ్‌కి తీసుకెళ్లిపోయాడు జక్కన్న. 

అయితే ఏమైంది షూటింగ్ సమయంలో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. దాంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. చరణ్  కాలికి, ఎన్టీఆర్‌ చేతికి గాయాలయ్యాయి. వీరిద్దరూ కోలుకోవాలంటే చాలా టైం పట్టేలా ఉంది. చరణ్ కి అయితే కాలికి బాగా తగిలినట్టు ఉంది. సరిగా నడవలేని పరిస్థితిల్లో ఉన్నాడు. మరి ఇద్దరూ కోలుకున్నాక అయినా ఫిట్‌నెస్‌ కోసమని రాజమౌళి టైమ్‌ ఇస్తాడో లేక షూటింగ్ లేట్ అవుతుందని డైరెక్ట్ గా షూటింగ్ చేసేస్తాడేమో చూడాలి.

Worries over Rajamouli’s RRR:

Are NTR, Ram Charan Really Fit?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs