నిన్నమొన్నటివరకు మహేష్ మహర్షి సినిమా మీద ట్రేడ్ లో కానీ, ప్రేక్షకుల్లో కానీ పెద్దగా ఆసక్తి కనిపించలేదు. మహర్షి టీజర్, మహర్షి సాంగ్స్ అన్నీ ఎక్కడో విన్నట్టుగా, ఎక్కడో చూసినట్టుగా ఉన్నాయంటూ పెదవి విరుపులు వినిపించాయి. సినిమా విడుదల దగ్గరపడుతున్నకొద్దీ.. సినిమా మీద బజ్ క్రియేట్ మాత్రం కాలేదు. ఇక మధ్యలో నిర్మాతల మధ్యన విభేదాలంటూ మీడియాలో వార్తలు రావడం ఇలా మహర్షి చుట్టూ నెగెటివిటి ఏర్పడింది. కానీ మహర్షి ఈవెంట్ దగ్గరనుండి.. మహర్షి ట్రైలర్ చూసాక సినిమా మీద మెల్లిగా అంచనాలు మొదలయ్యాయి. మహర్షి ట్రైలర్ కొత్తగా కనిపించడం, మహర్షి ప్రమోషన్స్ కూడా ఆకట్టుకునేలా ఉండడంతో సినిమా మీద ఇంట్రెస్ట్ మొదలైనది.
ఇక ఆ క్రేజ్ ఎంతగా పెరిగింది అంటే.. మహర్షి సినిమా టికెట్స్ ఇలా బుక్ మై షోలో పెడుతున్నారో లేదో అలా బుక్ అవుతున్నాయి టికెట్స్. జెర్సీ సినిమా హవాకి అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్రేకేసింది. ఇక అవెంజర్స్ క్రేజ్ కూడా ఈ వారాంతంలో అంతగా కనిపించడం లేదు. అవెంజర్స్ ఎండ్ గేమ్ మొదటి వీకెండ్ లో భీభత్సముగా కనబడినా.. సోమవారం నుండి అవెంజర్స్ ఎండ్ గేమ్ హవా తగ్గుతూ కనబడింది.
ఇక మహర్షి సినిమాకి మరో సినిమా పోటీ లేకపోవడం కూడా కలిసొచ్చే అంశం. కాగా మహర్షి సినిమా వచ్చిన రెండు వారాల వరకు మరో సినిమా లేకపోవడం, ఇక రెండు వారాలకు మీడియం రేంజ్ సినిమాలంటే సీత, అర్జున్ సురవరం లాంటి సినిమాలు తప్ప భారీ బడ్జెట్ చిత్రాలేమి బాక్సాఫీసు వద్దకు రాకపోవడం కూడా మహర్షికి కలిసొచ్చే అంశం. మహర్షికి హిట్ టాక్ పడిందా... ఇక నిర్మాతలకు కాసులే కాసులు.