Advertisement
Google Ads BL

సకల సమ్మేళనంతో ‘శివలింగాపురం’..!


గతంలో కొక్కొరొకో, మా తల్లి గంగమ్మ, లిటిల్ హార్ట్స్ వంటి అభిరుచి కలిగిన చిత్రాలను తీసిన నిర్మాత రావూరి వెంకటస్వామి తాజా ప్రయత్నంగా అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి అల్లికేశ్వరి సమర్పణలో శివలింగాపురం పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ, మలయాళ సినీరంగాలలో యాక్షన్ హీరోగా ఇమేజ్ ఉన్న ఆర్.కె.సురేష్  ఇందులో ద్విపాత్రాభినయం చేస్తూ... తెలుగు తెరకు తొలిసారి పరిచయమవుతున్నారు. అతని సరసన మధుబాల కథానాయికగా నటిస్తోంది. తోట కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ విషయాన్ని నిర్మాత రావూరి వెంకటస్వామి తెలియజేస్తూ... కథ విని స్పందించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో 35 రోజుల పాటు జరిపిన షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తయింది. మరోవైపు డబ్బింగ్ పనులు కూడా పూర్తిచేసుకుని ప్రస్తుతం రీరికార్డింగ్, గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. మేం అనుకున్నట్లుగానే చిత్రం చాలా బాగా వచ్చింది. జూన్ నెలలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు. 

Advertisement
CJ Advs

దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ... శివలింగాపురంలో జరిగిన కొన్ని సంఘటనలతో ఈ చిత్ర కథ సాగుతుంది. ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్, డివోషనల్ అంశాల సమ్మేళనంతో  ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. శివుడిగా డాక్టర్ భూమారెడ్డి, పార్వతిగా మేఘనా శ్రీలక్ష్మి నటించారు. శివశంకర్ మాస్టర్ చేసిన శివతాండవం నృత్యం చిత్రంలో ఓ ఆకర్షణగా నిలుస్తుంది. గతంలో చక్కటి కథాంశాలతో చిత్రాలను నిర్మించిన రావూరి వెంకటస్వామి దీనికి నిర్మాత కావడం వల్ల ఓ మంచి చిత్రం రూపుదాలుస్తోంది అని అన్నారు. 

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రియాపృథ్వి, ప్రదీప్, బత్తినేని శీను, వెడదల శివ నటించగా... బేబి హరిత ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రానికి కథ-వెడదల సాంబశివరావు, మాటలు-చరణ్, జానకిరామ్, పాటలు-టంగుటూరి రామదాస్, ఈమని వీరేంద్ర, కెమెరా-రఫి, సంగీతం-ఘనశ్యామ్, ఎడిటింగ్-మేనగ శ్రీను, ఫైట్స్-కృష్ణంరాజు, సమర్పణ-రావూరి అల్లికేశ్వరి, నిర్మాత-రావూరి వెంకటస్వామి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం-తోట కృష్ణ. 

Sivalingapuram Movie Update:

Sivalingapuram Movie Shooting Completed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs