Advertisement
Google Ads BL

‘డిస్కోరాజా’ అప్‌డేట్ వచ్చేసింది


మే 27 నుంచి రవితేజ, విఐ ఆనంద్, ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ ‘డిస్కోరాజా’ రెండో షెడ్యూల్

Advertisement
CJ Advs

మాస్ మహారాజా రవితేజ, వి‌ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’‌. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆగిపోయిందా అనే అనుమానాలతో కొన్ని వార్తలొచ్చాయి. ఈ వార్తల్ని నిర్మాత రామ్ తాళ్లూరి, ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ ఖండించారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ మే 27 నుంచి హైదరాబాద్ లో జరగనుంది. ఈ షెడ్యూల్ లో హీరో రవితేజ‌తో ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నేల టిక్కెట్ తర్వాత ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి, రవితేజతో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే డిస్కోరాజా షూటింగ్ పై వస్తున్న వార్తలపై నిర్మాత చెక్ పెడుతూ స్పందించారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. ఇటీవ‌లే విడుద‌ల చేసిన‌ డిస్కోరాజా మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఫస్ట్ షెడ్యూల్ తో ఫుల్ హ్యాపీ గా ఉన్నాం. ఔట్ ఫుట్ చాలా చాలా బాగా వచ్చింది. రెండో షెడ్యూల్ కోసం ప్లానింగ్ చేసుకుంటున్నాం. ఇంతలొనే... ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు చూసాం. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా సినిమా రూపొందుతున్న నేప‌థ్యంలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో కూడిన స‌న్నివేశాలు కీల‌కం, దీని కోసం ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్, చిత్ర యూనిట్ ప‌క్కా ప్లానింగ్ తో త‌దుప‌రి షెడ్యూల్ షూటింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. అందుకోస‌మే మొద‌టి షెడ్యూల్ పూర్తి కాగానే రెండో షెడ్యూల్ కోసం ఎక్కువ స‌మ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది. రెండో షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్న సందర్భంలోనే సినిమా ఆగిపోయిందని వచ్చిన వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే. మే 27 నుంచి జూన్ 21 వ‌ర‌కు హైద‌రాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నాం. ఈ కీలక షెడ్యూల్ లో ర‌వితేజ‌గారితో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొంటుంది. ఇక ఇందులో పాయల్ రాజపుత్, నభా నటేష్ హీరోయిన్లు అలానే సునీల్, రామ్‌కి, బాబీ సింహా, వెన్నెల కిషోర్ త‌దితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. డిస్కో రాజా టైటిల్ కి తగ్గట్టే ర‌వితేజ‌గారి అభిమానుల‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ఈ సినిమా ఉండనుందని అన్నారు. 

న‌టీన‌టులు:

ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌, సునీల్, రామ్‌కి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యానర్: ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత: రామ్ తాళ్లూరి

ద‌ర్శ‌కుడు: విఐ ఆనంద్

సినిమాటోగ్రాఫ‌ర్ :  కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని

డైలాగ్స్: అబ్బూరి రవి

మ్యూజిక్: థ‌మన్

ఎడిట‌ర్: న‌వీన్ నూలి

పీఆర్ఓ: ఏలూరు శ్రీను

DiscoRaja Movie Latest Update:

The second Schedule of DiscoRaja will go on floors from May 27th.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs