Advertisement
Google Ads BL

AISFM గ్రాడ్ ఫెస్టివల్‌లో స్టార్ రైటర్!


AISFM గ్రాడ్ ఫెస్టివల్ లో స్క్రిప్ట్ రైటింగ్ మేజర్ బ్యాచిలర్స్ / మాస్టర్స్ ప్రోగ్రాం ని ప్రారంభించిన స్టార్ రైటర్  విజయేంద్ర ప్రసాద్ హైదరాబాద్, మే 5 

Advertisement
CJ Advs

బాహుబలి భజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ కి స్క్రిప్ట్ ని అందించిన స్టార్ స్క్రిప్టు రైటర్ శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు  AISFM లో స్పెషలైజ్డ్ క్రియేటివ్ బ్యాచిలర్స్ , మాస్టర్స్ ప్రోగ్రాంని ప్రారంభించారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా (AISFM) గ్రాడ్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘‘కథల్ని ఆకట్టుకునేలా చెప్పాలి. ఒక ఆలోచనగా మొదలైన దాని చుట్టూ కథని నిర్మించాలి. అలా సిద్ధమైన ఆ కథ ఆత్మని అర్ధం చేసుకుని ప్రాణం పోయడమే ఫిలిం మేకింగ్. మన పరిసరాల్ని ఎంత సూక్ష్మంగా గమనిస్తామో అంత పవర్ఫుల్ కథని చెప్పగల నేర్పు సాధిస్తాం. ఫిలిం గ్రాడ్యుయేషన్ ఈ ప్రయాణానికి నాంది పలుకుతుంది.’’ 

రెండు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ నిన్న ప్రారంభమైంది. ఇందులో గ్రాడ్యుయేట్ విద్యార్థులు నిర్మించిన 8 విభిన్నమైన, ఆలోచన రేకెత్తించే చిత్రాలని ప్రదర్శిస్తున్నారు.          

రశ్మిత్ కౌర్ నిర్మించిన ‘ఇనాం’, ఆకాష్ చంద్రశేఖర్ మెల్లిగేరి నిర్మించిన ‘సందిగ్ధ’, సోమప్రియా బోస్ నిర్మించిన ‘కటక: - To Revive An Old వరల్డ్’, పుర్వాంగీ రాజన్ నిర్మించిన ‘చుప్పి’, ఉత్కర్ష బలరాం నిర్మించిన ‘నాన్ దెవృ’, ఎస్ వెంకట నారాయణ మూర్తి నిర్మించిన ‘ఫలక్’, సుస్మిత కాళంగి నిర్మించిన ‘అంతర్గత’, సిద్ధి యాదవ్ నిర్మించిన ‘Trivial Pursuit’... ఈ 8 చిత్రాల ప్రీమియర్ లని  ప్రదర్శిస్తున్నారు.

AISFM గ్రాడ్ ఫెస్టివల్ 2019 లో భాగంగా జరిగిన ఈ చిత్రాల ప్రీమియర్ కి తెలుగు సినీపరిశ్రమ ప్రతిభావంతులు విజయేంద్ర ప్రసాద్, సుమంత్ యార్లగడ్డ, అడివి శేష్, AISFM డైరెక్టర్ శ్రీమతి అమల అక్కినేని ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

AISFM చైర్మన్, కింగ్ అక్కినేని నాగార్జున యంగ్ ఫిలిం మేకర్స్ ని అభినందిస్తూ, ‘‘మీరు సరైన సమయంలో సరైన చోట ఉన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. ప్రయోగాలు చేయండి, కొత్తవి అర్ధం చేసుకోండి, కష్టపడండి, ఎదగండి. సినిమాల పట్ల మీకున్న ప్యాషన్, ప్రేమని ఇంకా ఇంకా పెంచుకోండి. అల్ ది బెస్ట్’’ అన్నారు 

AISFM స్టూడెంట్స్ లో సృజనాత్మకమైన ఆలోచనల్ని పెంపొందించడం, సినిమాకి సంబంధించి టెక్నికల్ అంశాల గురించి అవగాహన కల్పించడం చేస్తుంది. వారు తమ చిత్రాల్ని నిర్మించడానికి అనువుగా వరల్డ్ క్లాస్ స్టూడియో, పరికరాలని వారికి AISFM అందుబాటులో ఉంచుతుంది. టాలెంట్ ని ప్రోత్సహిస్తూనే విభిన్నమైన అంశాల పై విద్యార్థులు తమ అభిప్రాయాలకి అనుగుణంగా పనిచేసే వాతావరణం కల్పిస్తుంది.

AISFM డైరెక్టర్ అమల అక్కినేని స్టూడెంట్స్ ని అభినందిస్తూ, వారి ఉన్నత భవిష్యత్తుని కాంక్షిస్తూ, ‘‘మంచి సినిమా అంటే మంచి కథ, యాక్టింగ్, కెమెరా మాత్రమే కాదు. ప్రేక్షకులలో అంతర్మధనం జరిగేలా చేయగలిగేది. చెప్పాలనుకునే విషయం మీద పూర్తి అవగాహనతో అవసరమైనవి అన్ని సమకూర్చినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. టీంగా పనిచేయడం చాలా అవసరం. ఇక్కడ స్టూడెంట్స్ ఫిలిం మేకింగ్ మాత్రమే కాకుండా ఒకరితో ఒకరు తమ ఆలోచనలు పంచుకోవడం, ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, ఒక టీంగా కలిసి పనిచేయడం నేర్చుకుంటారు.’’ అన్నారు.

Star Writer at AISFM Grad Film Festival:

Vijayendra Prasad Announces Scriptwriting Major for Bachelors and Masters Programs at the AISFM Grad Film Festival
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs