Advertisement
Google Ads BL

పూజాకి అంత సీన్ లేదా? లేక దాస్తున్నారా?


మహేష్ బాబు సినిమాలంటే... అందరి కళ్ళు మహేష్ మీదే ఉంటాయి. అందులో నటిస్తున్న మిగతా వారి గురించి మీడియా పెద్దగా ఫోకస్ పెట్టదు. శ్రీమంతుడు సినిమాలో శృతి హాసన్ సినిమాలో చాలా కీలకమైన పాత్రలో నటించడమే కాదు.. మహేష్ తో కలిసి పాటల్లోనూ అదరగొట్టే డ్రెస్సెస్ లోను, డాన్స్ లతోను అదరగొట్టింది. శ్రీమంతుడు సినిమా విడుదల ముందు కన్నా విడుదలయ్యాకే శృతి గురించి ఇండియా బాగా మాట్లాడింది. తాజాగా మహర్షి సినిమా విషయంలోనూ మీడియా ఫోకస్ మొత్తం మహేష్ మీదే ఉంది. అందులో నటించిన అల్ల్లరి నరేష్ మీద కానీ, హీరోయిన్ పూజా హెగ్డే మీద గాని పెద్దగా ఫోకస్ పెట్టినట్లుగా కనిపిచడం లేదు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం మహర్షి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్, పూజా, వంశి పైడిపల్లి, అల్లరి నరేష్ లను ఛానల్స్ పోటీ పడి మరీ ఇంటర్వూస్ నిర్వహిస్తున్నాయి. ఎక్కడ చూసినా మహేష్ నవ్వు, మహేష్ మాటలే హైలెట్ గా నిలుస్తున్నాయి కానీ... పూజా, అల్లరి, వంశీల మాటలు కానీ వారి లుక్స్ కానీ హైలెట్ కావడం లేదు. ప్రస్తుతం టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న పూజా హెగ్డేని ట్రైలర్ లో పెద్దగా రివీల్ చెయ్యకుండా కేవలం మహేష్ తో ఈజీగా ఫ్రెండ్ షిప్ చేస్తూ కనబడింది. మరి గ్లామర్ గర్ల్ గానే పూజాని చూపించారా.. లేదంటే సినిమాలో కీలకంగా పూజాని చూపించారా అన్నది డౌట్. 

మరి పెద్ద హీరోలతో ఛాన్స్ వస్తే చాలని గ్లామర్ డాల్ క్యారెక్టర్ కి ఓకే చెప్పిందా.. లేదంటే మహర్షిలో పూజా పాత్ర ఎంతమేర ఆకట్టుకుందో అనేది ఈ గురువారం తేలిపోతుంది. ఇక అల్లరి నరేష్ విషయాలు మీడియాకి ఎక్కడా పొక్కనివ్వకుండా మహర్షి టీం జాగ్రత్త పడుతుంది. మరి అల్లరి నరేష్ క్యారెక్టర్ ఎంత కీలకం కాకపోతే.. మహర్షి టీం అంతగా అల్లరిని హైప్ చేస్తూ క్రేజ్ పెంచుతుంది.

Discussions on Pooja Hedge role in Maharshi:

What is the Pooja Hegde Role in Maharshi?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs