Advertisement
Google Ads BL

‘నాగకన్య’ వచ్చేది ఎప్పుడంటే..?


గతంలో జాతీయ నటుడు కమల్ హాసన్ తమిళంలో నటించిన నియా చిత్రం ఘన విజయం సాధించింది. దానికి సీక్వెల్ గా ఇప్పుడు నియా-2 పేరుతో తమిళంలోనూ, తెలుగులో నాగకన్య పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించారు.  జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా, వరలక్ష్మిశరత్ కుమార్, రాయ్ లక్ష్మి, కేథరిన్ థెరిస్సా ప్రధాన పాత్రలలో ఎల్.సురేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఎంతోమంది నిర్మాతలు ఈ చిత్రం తెలుగు హక్కుల కోసం పోటీపడగా వాటిని లైట్ హౌస్  సినీ మ్యాజిక్ అధినేత కె.ఎస్.శంకర్ రావు దక్కించుకున్నారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్.శంకర్ రావు మాట్లాడుతూ, వేసవి కానుకగా ఈ నెల 10న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇందులోని గ్రాఫిక్స్ పిల్లలతో పాటు పెద్దలను కూడా ఎంతో అలరింపజేస్తాయని, గ్రాఫిక్స్ కోసం అధికంగా ఖర్చు అయినా... వాటికున్న ప్రాధాన్యం దృష్ట్యా రాజీపడలేదని అన్నారు. హారర్ కథాంశంతో ఆద్యంతం ఆకట్టుకునే ఈ చిత్రంలో పాము చేసే విన్యాసాలు... మనిషి పాముగా మారే సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని, వాటిని దర్శకుడు చిత్రీకరించిన విధానం ప్రసంశనీయమని ఆయన చెప్పారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియోలకు మంచి స్పందన లభించిందని ఆయన తెలిపారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. 

ఈ చిత్రంలోని ఇతర ఫాత్రలలో బాలశరవణన్, అవినాష్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ-రాజావెల్ మోహన్, సంగీతం-షబీర్, ఎడిటింగ్-గోపీకృష్ణ, ఫైట్స్-జి.ఎన్.మురుగన్. 

Nagakanya Movie Release Date fixed:

Nagakanya Release on May 10
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs