Advertisement
Google Ads BL

‘భారతీయుడు 2’.. శంకర్ ట్రాప్‌లో పడతారా?


భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇండియన్ 2 సినిమాని ఎంతో గ్రాండ్‌గా ఎనౌన్స్ చేసాడు. అయితే ఆ సినిమా అనౌన్స్‌మెంట్ చేసాక చాలా రోజులకి దిల్ రాజు.. శంకర్ పెట్టే బడ్జెట్‌కి దడిచిపోయి ఇండియన్ 2 నిర్మాతగా తప్పుకున్నాడు. ఆ తర్వాత ఇండియన్ 2ని తామే నిర్మిస్తామని శంకర్ గత చిత్రాల నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు ముందుకు రావడం... మొదటి రెండు షెడ్యూల్స్ లైకా ప్రొడక్షన్స్‌లో చిత్రీకరణ జరగడం జరిగింది. అయితే శంకర్‌కి, లైకా వారికీ బడ్జెట్ విషయంలో విభేదాలు రావడంతో ఇండియన్ 2 చిత్రీకరణ ఆగిపోయింది. మధ్యలో కమల్ మేకప్ వలన అని ఒకసారి, కాదు కమల్ హాసన్ ఎలక్షన్స్‌లో బిజీగా ఉండడంతో ఇండియన్ 2 షూటింగ్ కి బ్రేకొచ్చిందనే న్యూస్ నడిచింది. 

Advertisement
CJ Advs

తాజాగా లైకా ప్రొడక్షన్స్‌వారు ఇండియన్ 2 నిర్మాతలుగా తప్పుకున్నారని... వార్తలొస్తున్నాయి. ఇన్ని పుకార్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నా దర్శకుడు శంకర్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు. అయితే లైకా వారు తప్పుకోవడంతో.. ఇండియన్ 2ని నిర్మించమని శంకర్ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను సంప్రదించాడట. అయితే రిలయన్స్ వారు శంకర్ కి హామీ ఇవ్వకపోయినా.. లైకా ప్లేస్ లోకి రిలయన్స్ వారు ఇండియన్ 2ని నిర్మించే ఛాన్సెస్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక కమల్ కూడా ఈ ఎన్నికల రిజల్ట్ రాగానే ఇండియన్ 2 షూటింగ్‌లో పాల్గొంటాడని.. ఈలోపు రిలయన్స్ విషయం కూడా తేలుతుందని అంటున్నారు.

Indian 2 Producer Changed:

Shankar Indian 2 goes to Reliance Entertainment Hands
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs