Advertisement
Google Ads BL

మెగా ఫ్యాన్స్‌ని ముప్పుతిప్పలు పెడుతోంది


ఎవరి పేరు చెబితే మెగా ఫ్యాన్స్‌కి మండిపోతుందో ఆవిడే వారిని ఇప్పుడు ముప్పుతిప్పలు పెడుతోంది. సమాజాన్ని ఉద్ధరించాలని కొంగు బిగించి.. సారీ ఉన్నవి విప్పి మరీ పోరాటానికి సిద్ధమైన శ్రీరెడ్డి మొదలెట్టిన యుద్ధం అటూ ఇటూ కాకుండా అర్థాంతరంగా ఆగిపోయింది. మహిళ అయినా తన యుద్ధాన్ని మంచి పీక్ స్టేజ్‌‌లోకి తీసికెళ్లిన సమయంలో చేసిన పెద్ద పొరపాటు కారణంగా.. మళ్లీ తిప్పుకోలేని షాక్‌కి గురైంది శ్రీరెడ్డి. పవన్ కల్యాణ్ వాళ్ల అమ్మ ప్రస్తావన తీసుకురావడమే.. శ్రీరెడ్డి పతనానికి కారణమైంది. లేదంటే ఈ రోజు శ్రీరెడ్డి టాలీవుడ్‌ను షేక్ చేసేది. 

Advertisement
CJ Advs

ఇక ఆ టైమ్‌లో వర్మ కలుగుజేసుకోవడంతో బ్రతికిపోయిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత తన యాటిట్యూడ్‌ను మాత్రం సాధ్యమైనంతగా ప్రదర్శిస్తూనే ఉంది. ఆమె వెనుక ఎటువంటి పొలిటికల్ శక్తులున్నాయనేది పక్కన పెడితే.. ఆమె వీరనారిగా పొందాలనుకున్న గుర్తింపును కాలరాసిన కల్యాణ్‌పై మాత్రం కదంతొక్కుతూనే ఉంది. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్‌పై ఆమె చేసే దారుణాతిదారుణమైన పోస్ట్‌లు మెగాభిమానుల బ్లడ్‌ను ఉడికించేస్తుంది. ఈ మాట అనవచ్చు, ఈ మాట అనకూడదు అనే భేదం లేకుండా పవన్ కల్యాణ్‌పై పంజా విసురుతుంది శ్రీరెడ్డి. ఇలా విపరీతార్థపు పోస్ట్‌లతో మెగా హీరో, నాయకుడిని టార్గెట్ చేస్తూ.. మెగాభిమానులను ముప్పుతిప్పలు పెడుతోంది.

నన్ను కదిలించేవాడే లేడు అన్నట్లుగా ఆమె చేస్తున్న పోస్ట్‌లకు బ్రేక్ వేయాలని, సోషల్ మీడియా నుంచి ఆమెను తరిమి కొట్టాలని మెగాభిమానులు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వారి ప్రయత్నాలను తిప్పికొడుతూ రోజురోజుకూ ముదిరిపోతోంది శ్రీరెడ్డి. ఈ మధ్య మెగాభిమానులందరూ శ్రీరెడ్డి ఫేస్ బుక్ టార్గెట్ చేస్తూ కంప్లయింట్ సెల్‌కు మెసేజ్‌లు పంపినా.. ఏం ఉపయోగం లేకుండా పోవడంతో.. ఎలాగైనా శ్రీరెడ్డిని సోషల్ మీడియా నుంచి పారిపోయేలా చేయాలని వారు వేసే స్కెచ్‌లు వారు వేస్తూనే ఉన్నారు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నట్లుగా శ్రీరెడ్డి కూడా వారిని రెచ్చగొట్టడంలో అస్సలు తగ్గడం లేదు. 

Controversy Heroine Creates Headache to Mega Fans:

Sri Reddy Targets Pawan Kalyan in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs