రెండు రోజులు క్రితం మంచు హీరో విష్ణు ఓ అద్భుతమైన మెసేజ్ ఇవ్వబోతున్నాను.. అది అలాంటిలాంటి మెసేజ్ కాదంటూ ట్వీట్ చేయడంతో అంతా ఇదేదో తన తదుపరి చిత్రం గురించని అనుకున్నారు. కానీ మరోసారి తండ్రి కాబోతున్నట్లుగా మంచు విష్ణు ఎంతో ఎగ్జయిట్ అవుతూ విషయం తెలిపాడు. మరి ఈ మెసేజ్ ఎవరికి ఇచ్చినట్టో, దీని ద్వారా ఆయన అసలు ఏం చెప్పదలుచుకుంటున్నాడో.. ఆయనకే తెలియాలి.
ఆయన ఇచ్చిన మెసేజ్ ఏమిటంటే ‘‘స్పెషల్ లొకేషన్ నుంచి స్పెషల్ అనౌన్స్‌మెంట్. విన్నీ స్వస్థలం, మాకెంతో ఫేవరేట్ ప్లేస్. ఇప్పటికే మా కుటుంబంలో అరియానా, వివియానా, ఆవ్రామ్ వచ్చారు. ఇప్పుడు నాలుగో దేవదూత రాబోతుంది. ప్రపంచంలో మోస్ట్ బ్యూటీఫుల్ ఫీలింగ్ కలుగుతుంది. చాలా ఎగ్జయిట్‌మెంట్‌గా ఉంది’’ అంటూ తను మళ్లీ తండ్రి కాబోతున్నట్లుగా మంచు విష్ణు తెలిపాడు. ఇది మంచు అభిమానులకు మంచి విషయమో కానీ.. ఏదో ఘనకార్యం సాధించినట్లుగా రెండు రోజుల ముందే దీనికి సస్పెన్స్ ట్వీట్స్ అవసరమా అంటూ నెటిజన్లు గట్టిగానే ఏసుకుంటున్నారు.
వాస్తవానికి ఎవరైనా.. ఎన్ని సార్లు తండ్రి అయినా.. కలిగే ఎగ్జయిట్‌మెంట్‌ను మంచు విష్ణు ప్రదర్శించినప్పటికీ కొందరు నెటిజన్లు మాత్రం దానిని స్వీకరించలేకపోతున్నారు. అందుకే కామెంట్స్ రూపంలో ఇష్టం వచ్చినట్లుగా మంచు విష్ణుపై సెటైర్లు సంధిస్తున్నారు. కొందరు మాత్రం మంచు విష్ణు దంపతులకు అభినందనలు తెలుపుతూ రీ ట్వీట్స్ చేస్తున్నారు.