Advertisement
Google Ads BL

సాయిపల్లవి కోపానికి కారణం ఇదే..!


  • రానా ‘విరాటపర్వం’ సినిమాలో సాయిపల్లవి
  • ఇంకా షూటింగ్ మొదలుకాని చిత్రం
  • బల్క్ డేట్స్ ఇచ్చిన సాయిపల్లవి తీవ్ర ఆగ్రహం

సాయిపల్లవితో చాలా కష్టం అంటుంటారు ఆమెతో పనిచేయాలన్న దర్శకనిర్మాతలు. తన పాత్ర నచ్చకపోతే.. ఆమె సినిమాని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తుంది. అందుకే ఆమెకి కథ చెప్పాలంటే దర్శకనిర్మాతలకు తల ప్రాణం తోకకు వస్తుంది. ఇక తెలుగులో తనకి లైఫ్ ఇచ్చిన దిల్ రాజులాంటి నిర్మాతకు శ్రీనివాస కల్యాణంలో తన పాత్ర నచ్చలేదనే నో చెప్పేసింది. అయితే తాజాగా సాయి పల్లవికి ఒక విషయంలో కోపం వచ్చిందని అందుకే దర్శకనిర్మాతలు పిలిచి వార్నింగ్ ఇచ్చిందనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
CJ Advs

అసలు సాయి పల్లవికి కోపమెందుకువచ్చింది అంటే... సాయి పల్లవి మెయిన్ లీడ్‌లో రానా ప్రధాన పాత్రలో వేణు ఊడుగుల అనే డైరెక్టర్ విరాట పర్వం సినిమాని అనౌన్స్ చేసాడు. అయితే వేణు.. విరాట పర్వం స్క్రిప్ట్ మీద చాలా రోజుల నుండి కూర్చుకున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి డి గ్లామర్ గా నక్సలైట్ పాత్రలో కనిపించబోతుంది. ఇక రానా కూడా వార్డ్ మెంబెర్‌గా పొలిటికల్ కేరెక్టర్ చేయబోతున్నాడని.... బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు ఈ సినిమాలో లేడి విలన్ గా నటించబోతుందని ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు ఈ సినిమాని ఇంకా పట్టాలెక్కించకుండా మీనమేషాలు లెక్కెడుతున్న డైరెక్టర్ మీద సాయి పల్లవి ఫైర్ అయ్యిందట.

ఈ సినిమాలో కీలకపాత్ర కావడంతో సాయి పల్లవి ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి వచ్చిందట. అయితే సాయి పల్లవి డేట్స్ వృధా అయిపోతున్నా... ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమా షూటింగ్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమాకి ఎక్కువ డేట్స్ ఇచ్చిన కారణంగా మిగతా సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక సాయి పల్లవి కింద మీద పడడంతో.. సాయి పల్లవి విరాట పర్వం టీంకి వార్నింగ్ ఇచ్చిందట. ఎంత వీలయితే అంత త్వరగా సినిమా మొదలెట్టమని.. లేదంటే ఈ సినిమా నుండి తప్పుకుంటానని బెదిరించిందనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది.

Sai Pallavi’s Serious Warning:

Sai Pallavi Threatens To Walk Out Of Virata Parvam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs