Advertisement
Google Ads BL

సిద్ధార్థ్ తన తప్పు తెలుసుకున్నాడా?


అందరు స్టార్‌ హీరోలు బహుభాషల్లో గుర్తింపు తెచ్చుకోవాలని ఈమధ్య ఆశపడుతున్నారు. ఇలా ఇతర భాషల్లో క్రేజ్‌ వస్తే అది నిర్మాతలకు కూడా లాభదాయకంగా ఉంటుంది. దర్శకులు కూడా అన్ని భాషల అభిరుచికి సరిపోయే కథలతో ముందుకొస్తారు. ఇప్పుడు మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రభాస్‌, అల్లుఅర్జున్‌, రానా వంటి వారు ఇతర భాషల్లో క్రేజ్‌కి బాగా కష్టపడుతున్నారు. అందుకే పాన్‌ ఇండియా చిత్రాలను ఒప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. మలయాళంలో అల్లుఅర్జున్‌కి ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే. ఇక ప్రభాస్‌కి ‘బాహుబలి’తో దేశ విదేశాలలో సైతం గుర్తింపు వచ్చింది. రానా కూడా అదే దారిలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాలు చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

కానీ నిన్నటితరం స్టార్స్‌ అయిన చిరంజీవి, బాలకృష్ణ. నాగార్జున, వెంకటేష్‌ వంటి వారు కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో అడుగుపెట్టినా ఇక్కడ వచ్చినంత గుర్తింపు వారికి నాడు అక్కడదక్కలేదు. కానీ అనుకోకుండా అలాంటి అవకాశం అందుకున్న హీరోగా, చాక్లెట్‌బోయ్‌, లవర్‌బోయ్‌ సిద్దార్ద్‌ని చెప్పుకోవచ్చు. తమిళంలో ‘బోయ్స్‌’తో పాటు తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం’ వంటి చిత్రాలతో తెలుగులో కూడా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. కానీ కెరీర్‌పై దృష్టి పెట్టకుండా హీరోయిన్లతో ఎఫైర్లలో కాలం గడిపి తప్పిదం చేశాడు. ఈయనకు తమిళంలోనే కాదు.. తెలుగు, హిందీ భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఆయన నటుడే కాదు.. దర్శకుడు, రచయిత కూడా. ఇలాంటి సిద్దార్ద్‌ ఆమద్య తెలుగు ప్రేక్షకుల మీద అలిగి, తెలుగు ఆడియన్స్‌ని కించపరిచేలా మాట్లాడాడు. అప్పటి నుంచి కోలీవుడ్‌లోనే వరుస చిత్రాలు చేస్తున్నాడు. అప్పుడప్పుడు హిందీలో నటిస్తున్నాడు. కానీ సిద్దార్ద్‌ మరలా తెలుగులోకి ఎంటర్‌ కావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయం గురించి ఆయన ట్విట్టర్‌లో తెలిపాడు. 

ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఎవరు ఏమన్నానేను తిరిగి వస్తున్నానులే. నా ప్రామిస్‌ని గుర్తు పెట్టుకోండి ప్లీజ్‌. మిమ్మల్ని అలరించేందుకు బెస్ట్‌గా ప్రయత్నిస్తాను. తెలుగు ప్రేక్షకుల్లారా 18నెలల సమయం నాకు ఇవ్వండి.. మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వస్తున్నాను. ఎంతో కష్టపడి మంచి కంటెంట్‌ని రెడీ చేశామని తెలిపాడు. నేను ఆన్‌ ది వే. మాట్లాడుకుందాం. అంటూ ఓ లవ్‌ ఎమోజీని సిద్దు షేర్‌ చేశాడు. ప్రస్తుతం సిద్దార్ద్‌ తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. నాటి సిద్దార్ద్‌ తెలుగులో నటించినప్పటికి నేటికి తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో మార్పు చెందింది. తెలుగులో తమిళంతో పోటీ పడి వైవిధ్యభరితమైన చిత్రాలు వస్తున్నాయి. వాటిని ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. మరి తెలుగులో వచ్చిన ఈ మార్పే సిద్దార్ధ్‌ నిర్ణయానికి కారణంగా చెప్పవచ్చు. 

Siddharth Tweet about Tollywood Re Entry:

Siddharth Knows His Mistake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs