నాజర్, సత్యరాజ్ వంటి వారు ఎందరో సీనియర్లు అయి ఉండవచ్చు. కానీ వారి కెరీర్స్‌లో ది బెస్ట్‌గా చెప్పుకునే ‘బాహుబలి’ ద్వారా వీరికి దేశవిదేశాలలో గుర్తింపు వచ్చింది. ఇక సుబ్బరాజు వంటి వారికి విదేశాలలో వస్తున్న గుర్తింపు చూస్తే ఎవరైనా ఫ్లాట్ అయిపోవాలి. ఇక ఈ ప్రస్తుత దిగ్గజ దర్శకుడు, జక్కన్న అలియాస్ రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం తీస్తున్నాడు. చరణ్, ఎన్టీఆర్‌లకి స్వల్ప గాయాల కారణంగా ఈ చిత్రం షూటింగ్‌కి గ్యాప్ వచ్చింది. మరో వారం రోజుల్లో రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఇందులో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు, జూనియర్ ఎన్టీఆర్ ‘కొమరం భీం’లని స్ఫూర్తిగా తీసుకునే ఫిక్షన్ కథతో పీరియాడికల్‌గా రానుంది. రామ్‌చరణ్ పాత్రకి బాలీవుడ్ సంచలన నటి అలియాభట్‌ని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఓ బ్రిటిష్ యువతి నటించనుంది.
కానీ ఆమె హఠాత్తుగా ఈ చిత్రం నుంచి తప్పుకుంది. కథరీత్యా ఇందులో జోడీ బ్రిటిష్ యువతిగా ఉండనుంది. మరి కొత్తగా రాజమౌళి మరో నటిని విదేశాల నుంచి తెస్తాడా? లేక కథను కాస్త మార్చి పరిణితి చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, శ్రద్దాకపూర్‌ల కోసం ప్రయతిస్తున్నారు. ఇక ఈ మూవీలో టాలెంటెడ్ నటి నిత్యామీనన్ కూడా ఓ పాత్రలో నటించనుంది. ఈమెది తన బావని ప్రేమించే అమాయకురాలైన గిరిజన యువతి సీత పాత్రను పోషించనుంది.
ఇక మరో కీలకమైన పాత్రకు తమిళ దర్శకుడు, నటుడు సముద్ర ఖని ఓ పాత్ర చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర ఎన్టీఆర్‌కి బాబాయ్ పాత్ర అని సమాచారం. మొత్తానికి తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని సముద్రఖనిని తీసుకుని రాజమౌళి తనప్రత్యేకతను చాటుకున్నాడనే చెప్పాలి.