Advertisement
Google Ads BL

‘మహర్షి’కి మెయిన్ పిల్లర్ అతనేనా?


మహర్షి మీద ఇప్పటి వరకు రాని అంచనాలు ఇప్పుడు మహర్షి ట్రైలర్ విడుదలయ్యాక వచ్చేసింది. కారణం మహర్షి ట్రైలర్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మహర్షి ట్రైలర్‌లో ప్రేమ, స్నేహం, ఎమోషన్, యాక్షన్, పగ అన్ని కనిపించేసరికి అందరూ మహర్షి మీద హోప్స్ పెట్టుకోవడం మొదలెట్టేసారు. నిన్నమొన్నటి వరకు మహర్షి సినిమా మీద ప్రేక్షకుల్లోనే కాదు. కనీసం ట్రేడ్ లో ఓ అన్నంత ఆసక్తి కనిపించలేదు. కానీ మహర్షి ఈవెంట్ తో పాటుగా ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో మహర్షి మీద అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ మీద మహర్షి టీం గంపెడు ఆశలు పెట్టుకుందని నిర్మాత దిల్ రాజు చెప్పిన దాన్నిబట్టి అర్ధమవుతుంది.

Advertisement
CJ Advs

నిన్నమొన్నటివరకు శ్రీమంతుడు సినిమాతో మహర్షికి పోలిక పెడుతూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ న్యూస్ లు ప్రసారమవ్వగా.. ఇప్పుడు దిల్ రాజు చెప్పినదాన్ని బట్టి.. మహర్షి క్లైమాక్స్ కి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కనెక్ట్ అవడం ఖాయంగా కనబడుతుంది. ట్రైలర్ లో స్టోరీని రివీల్ చెయ్యకుండా చాలా జాగ్రత్తగా ట్రైలర్ కట్ చేసిన మహర్షి టీం.... ప్రేక్షకుల్లో సస్పెన్స్ నింపింది. ఇక ఈ సినిమా కోసం ఎమోష‌న‌ల్ క్లైమాక్స్ డిజైన్ చేశాడు వంశీ పైడిప‌ల్లి. అది చూస్తే ఎవ్వ‌రికైనా క‌న్నీళ్లు ఆగ‌వ‌ట‌. ఈ విష‌యాన్ని దిల్‌రాజు స్వయంగా చెప్పాడు. మరి దిల్ రాజు చెప్పినదాన్నిబట్టి మ‌హ‌ర్షి ప్రాణం అంతా ఆ క్లైమాక్స్ దగ్గరే ఉందనిపిస్తుంది.  ఇక ఈ సినిమాలో మొదటినుండి చెప్పినట్టుగా అల్లరి నరేష్ పాత్ర సినిమాకి కీలకమవుతుందని మహర్షి టీం భావిస్తుందట. అందుకే అల్లరి నరేష్ పాత్రని ఎక్కడా రివీల్ చెయ్యకుండా జాగ్రత్త పడుతుంది. ఆఖరుకి ట్రైలర్ లోను ట్రైలర్ మొత్తం మహర్షి చుట్టూనే తిప్పారు కానీ.. ఎక్కడ అల్లరి నరేష్ ని హైప్ చెయ్యలేదు. 

అయితే సోషల్ మీడియా టాక్ ప్రకారం అల్లరి నరేష్ ని స్క్రీన్ పై  చూసి షాక్ అవ్వాల‌న్న‌ది వాళ్ల ఉద్దేశం. అలాగే అల్లరి న‌రేష్ పాత్ర‌కు యాంటీ క్లైమాక్స్ డిజైన్ చేశార‌ని.... అక్కడే రిషి పాత్ర‌లో మార్పు మొద‌ల‌వుతుందని.. అంటున్నారు. మరి దీన్నిబట్టి మ‌హ‌ర్షి బ‌లం.. న‌రేష్‌, క్లైమాక్స్ సీన్ అని తెలుస్తుంది.

He is the Maharshi Movie Main Piller:

Allari Naresh Key Role in Maharshi Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs