Advertisement
Google Ads BL

‘మహర్షి’ ట్రైలర్: ఎలా ఉండాలో అలా ఉంది


మహేష్ మహర్షి జర్నీ మొదలైంది. నిన్నమొన్నటివరకు అంతగా బజ్ లేని మహర్షి సినిమా మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ అనగానే కాస్త హైప్ పెరిగింది. ఇక ఆ ఈవెంట్ కి వెంకటేష్, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హాజరవడం మహేష్ అభిమానులకు ఉత్సాహాన్నిచ్చింది. హైదరాబాద్ లో మహర్షి ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇక మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే మహర్షి ట్రైలర్‌ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం. మహర్షి ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమాతో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనబడుతుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా... అల్లరి నరేష్ మహేష్ ఫ్రెండ్‌గా నటించిన ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశాడు.

Advertisement
CJ Advs

ఇక మహర్షి ట్రైలర్‌లోకి వెళితే... ఏం సాధిద్దాం అనుకుంటున్నావు రిషి అని రావు రమేష్ మహేష్ ని ఉద్దేశించి మాట్లాడితే... మహేష్ మాత్రం ఏలేద్దామనుకున్నా సార్ అంటూ మొదలెడతాడు. ఏంటి అని రావు రమేష్ ఆశ్చర్యపోతే.. ప్రపంచాన్ని ఏలేద్దామనుకున్నాను అంటూ కాన్ఫిడెంట్ తో మహేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. సక్సెస్ కి ఒక ఎగ్జాంపుల్ గా మారిన మీ గురించి తెలుసుకోవాలని మాకందరికి ఉంది.. సక్సెస్ ఎక్కడుంది అని ఝాన్సీ అడిగిన ప్రశ్నకు మహేష్.. గతం, మనందరికీ గతం ఉంది మనం గతంలో ఎక్కడున్నాం, ఇప్పుడెక్కడున్నాం, దాన్ని బట్టి మనకర్ధమైపోతుంది... వెథర్ వె అర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్.... అంటూ కూల్ గా చెప్పే డైలాగ్... ఇక స్కూటర్ మీద వెన్నెల కిషోర్ ని ఎక్కించుకుని కాలేజ్ కి వస్తూ హీరోయిన్ పూజ హెగ్డే.. రిషి కాఫీ తాగడానికి వస్తవా అంటే... అమ్మాయి కాఫీ కి పిలిచింది కదా అని.. లైఫ్ ని రిస్క్ లో పెట్టలేం అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక అల్లరి నరేష్, మహేష్ ని ఫ్రెండ్ గా అనుకోవడం.. మహేష్, పూజ తో కలిసి ఫ్రెండ్షిప్ చెయ్యడం ఇవన్నీ వంశీ పైడిపల్లి అందంగా చూపించాడు. ఇక జగపతిబాబు ఇప్పటివరకు నీకు గెలవడమే అలవాటనుకుంటా.. ఇప్పటినుండి ఓడిపోవడం కూడా అలవాటు చేసుకో అంటూ మహేష్ ని రెచ్చగొడితే... దానికి మహేష్ మాత్రం చాలా కూల్ గా చిన్నప్పుడెప్పుడో మా అమ్మకు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నీకే చెప్పడం.. ఓడిపోవడం అంటే నాకు భయం, ఆ భయంతోనే ఇక్కడిదాకా వచ్చాను. మళ్ళీ ఆ భయాన్ని నాకు పరిచయం చేసింది నువ్వే అంటూ మహేష్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అదుర్స్ అన్న రేంజ్ లో ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పే పనే లేదు. దేవి ఇరక్కొట్టేశాడు. ఫొటోగ్రఫీ అదిరింది. ఓవరాల్‌గా ట్రైలర్ మాత్రం ఎలా ఉండాలో అలా ఉంది.

ఇక మహేష్ మాత్రం కొన్ని చోట్ల కాదు కాదు.. అన్ని చోట్లా చాలా స్టైలిష్ గా కనిపించాడు. సూటు బూటు లోనే కాదు.. ప్యాంట్ షర్ట్ లోను నాగలి పట్టిన మహేష్ అదరగొట్టాడు. ఇక పూజ హెగ్డే గ్లామర్ గా ఆకట్టుకుంది. అల్లరి నరేష్ మాత్రం మహేష్ కి పూజ కి ఫ్రెండ్ గా చాలా సాదా సీదా గా నటనతో ఆకట్టుకున్నాడు. మోహనన్ సినిమాటోగ్రఫీ బావుంది. ఇక  దేవిశ్రీ సంగీతం ఓకె ఓకె కానీ.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.  

Click Here For Trailer

Maharshi Trailer Review:

Mahesh Babu Maharshi Trailer Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs