Advertisement
Google Ads BL

చిరు స్పీడ్‌కు షాకవుతున్నారు..!


మెగాస్టార్‌ చిరంజీవి.. సినీ రంగంలో అందరివాడిగా పేరు తెచ్చుకున్న ఈయన.. ఆ తర్వాత రాజకీయాలలోకి వెళ్లి పెద్దగా రాణించలేకపోయాడు. అక్కడ ఆయనకు కేవలం కొందరివాడు అనే ముద్ర పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన లాంగ్‌ గ్యాప్‌ తీసుకుని దాదాపు దశాబ్దం తర్వాత తన 150వ ప్రతిష్టాత్మక చిత్రంగా ‘ఖైదీనెంబర్‌ 150’ చేశాడు. వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మురుగదాస్‌-విజయ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తమిళ బ్లాక్‌బస్టర్‌ ‘కత్తి’కి రీమేక్‌. ఈ చిత్రంతో చిరు నాన్‌-బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఆయన తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా ‘సై..రా..నరసింహారెడ్డి’ చేస్తున్నాడు. దీనిని కూడా ఆయన కుమారుడు చరణ్‌ తమ హోం ప్రొడక్షన్‌ కొణిదెల బేనర్‌లో నిర్మిస్తుండగా, సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం తెలుగులో అతి ఎక్కువ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా దక్షిణాదిలో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ఈ చిత్రంతో చిరు ‘బాహుబలి’ రికార్డులపైనే దృష్టి పెట్టాడు. ఈ చిత్రం ఒక శాతం మినహా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో తన పార్ట్‌ షూటింగ్‌ పూర్తికాగానే పెద్దగా గ్యాప్‌ లేకుండా చిరు కొరటాల శివ చిత్రం ప్రారంభించనున్నాడు. కొణిదెల బేనర్‌తో పాటు మ్యాట్నీ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ చిత్రం కూడా కొరటాల శివ సినిమాల స్టైల్‌లోనే మంచి సందేశంతో పాటు కమర్షియల్‌ అంశాలను జోడించుకుని రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ని కొరటాల శివ లాక్‌ చేశాడని సమాచారం. ‘మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్‌, భరత్‌ అనే నేను’ వంటి పలు చిత్రాల ద్వారా తనతో పని చేసిన ప్రతి స్టార్‌కి కెరీర్‌లో బెస్ట్‌ మూవీస్‌ని అందించిన కొరటాల ఈ చిత్రాన్ని కూడా అదే తరహాలో చిరంజీవికి గిఫ్ట్‌ ఇవ్వనున్నాడట.

ఇక ఇందులో శృతిహాసన్‌-తమన్నాలు కలిసి నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ఎప్పటి నుంచో ఈ జనరేషన్‌ హీరోయిన్లలో తనకు తమన్నాతో కలిసి డ్యాన్స్‌ చేయాలని ఉందని చెప్పాడు. ఆల్‌రెడీ తమన్నా చిరు ‘సై..రా’లో ఓ పాత్రను పోషిస్తోంది. ఇక సునీల్‌, అనసూయలు ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ మూవీని వచ్చే సమ్మర్‌కి విడుదల చేయాలని భావిస్తున్నారట. దీని తర్వాత చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో చిత్రం మొదలుకానుంది. ఇవికాక తమిళ దర్శకదిగ్గజం శంకర్‌ దర్శకత్వంలో చిరు ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. తమిళ డైరెక్టర్‌ ఎక్కువ శాతం తెలుగు స్ట్రెయిట్‌ చిత్రాలతో అపజయాలనే మూటగట్టుకున్నారు. మరి శంకర్‌ చిత్రం నిజమే అయితే ఆ చిత్రం ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాలి. ఇలా వరుస చిత్రాలతో చిరు.. యంగ్ హీరోలకు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

Mega Star Chiranjeevi gives Shock Young Heroes :

Chiranjeevi Busy with Back to Back Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs