Advertisement
Google Ads BL

రానాని ఆటపట్టించిన సుమ..!


తెలుగు బుల్లితెర యాంకర్లలో సుమది ఓ ప్రత్యేకమైన స్థానం. ఆమె స్పాంటేనియస్‌గా, సందర్భానుసారం చమ్మక్కులు విసురుతూ ఎదుటి వారిని ఆటపట్టించి, ఆయా షోలను, వేడుకలను రక్తికట్టించడంలో దిట్ట. అందుకే ఆమెకి బుల్లితెర మీద పలు కార్యక్రమాలకు యాంకర్‌గానే కాకుండా పెద్ద పెద్ద సినీ వేడుకలకు సైతం భారీ పారితోషికం ఇచ్చి తీసుకుంటారు. ఇక విషయానికి వస్తే సుమలానే కమెడియన్‌ అలీ వంటివారు కూడా యాంకర్లుగా సుప్రసిద్దులు, అయితే అలీ అప్పుడప్పుడు డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు వాడటం వల్ల ఆయనపై విమర్శలు వస్తూ ఉంటాయి. ఈ విషయంలో సుమతో పాటు పలువురితో అలీకి గొడవ కూడా జరిగిందని చెబుతూ ఉంటారు. ఇక టాలీవుడ్‌ యంగ్‌ హీరోలలో దగ్గుబాటి రానా, అల్లుశిరీష్‌లు కూడా పలు కార్యక్రమాలను తమదైన శైలిలో నడిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా రానా అయితే ‘నెంబర్ వన్‌ యారీ’ షోకి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించి మెప్పించాడు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే ఇటీవల నేచురల్‌ స్టార్‌నాని, శ్రద్దాశ్రీనాథ్‌ జంటగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ చిత్రం వచ్చింది. ఈ చిత్రం ముక్తకంఠంతో పాజిటివ్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థ్యాంక్స్‌ మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, దగ్గుబాటి రానా హాజరయ్యాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ, నాకు క్రికెట్‌ అన్నా, అమ్మాయిలు, పెళ్లి, పిల్లలు అన్నా ఇష్టం లేదు. అలాంటిది ‘జెర్సీ’ చిత్రం చూసిన తర్వాత కన్నీరు రాకుండా ఆపుకోలేకపోయాను. నా పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య ప్రేక్షకుడి పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోండి... అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు. అయితే సుమ ఎట్టి పరిస్థితుల్లోనైనా చమత్కరించే దిట్ట కావడంతో వెంటనే మైక్‌ అందుకుని మీకు త్వరలోనే అమ్మాయిలు, పెళ్లి, పిల్లలు గురించి బాగా అర్ధం కావాలని కోరుకుంటున్నాను..అనడంతో చప్పున రానా, సుమకి వచ్చి కాళ్లకు నమస్కారం చేయబోయాడు. అది చూసి ఖంగుతిన్న సుమ తన కాళ్లను వెనక్కి లాగేసుకుంది. రానా నుంచి తప్పించుకోవడానికి ఆయన్ను ఆటపట్టిస్తూ వేదిక మొత్తం పరుగులు పెట్టింది. 

అనంతరం మరలా సుమ మాట్లాడుతూ, అందరు పెళ్లి చేసుకుని కష్టపడుతుంటే మీరు మాత్రం సుఖంగా ఉండాలా? అందుకే మీరు కూడా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, అమ్మాయిల మనసు అర్ధం చేసుకోవాలి... అంటూ రానాను కవ్వించేలా బదులిచ్చింది. ఈ ఎపిసోడ్‌ మొత్తం ఈ కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి. 

Suma Counters on Rana:

Suma Satires on Rana at Jersey Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs