Advertisement
Google Ads BL

‘రాక్షసుడు’కు భారీగా కోశారుగా..!


బెల్లంకొండ శ్రీనివాస్ తో ఏ దర్శకుడు పనిచేసినా.. ఏ హీరోయిన్ పనిచేసినా.. వారికి ఎవరు ఎక్సపెక్ట్ చెయ్యని పారితోషకాలే అందుతాయి. మరి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటే అంతా రిచ్. నిర్మాతలు కూడా బెల్లంకొండ సురేష్ ని చూసే శ్రీనివాస్ కి పెట్టుబడి పెడతారు. ఎప్పుడూ అంటే శ్రీనివాస్ మొదటి సినిమా నుండి అతని మార్కెట్ మీద కన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టడం.. ఆ పెట్టుబడి వెనక్కి తీసుకురావడానికి నిర్మాతలు నానా తంటాలు పడడం.. ఇలా అలవాటైపోయింది. అల్లుడు శీను దగ్గరనుండి... సీత సినిమా వరకు బడ్జెట్ పరిమితులు లేకుండా బెల్లంకొండ సినిమాలు తెరకెక్కాయి.

Advertisement
CJ Advs

కానీ ఇపుడు మాత్రం బెల్లంకొండ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని.. మరీ సినిమాకి బడ్జెట్ పెడుతున్నారట. అలాగే ఆ బెల్లంకొండ చెయ్యబోయే తాజా చిత్రం తమిళ రచ్చసన్ రీమేక్ రాక్షసుడు సినిమాకి కేవలం 15 కోట్ల బడ్జెట్ మాత్రమే పెడుతున్నారట. ఆ సినిమాకి కేవలం 15 కోట్లు బడ్జెట్ కేటాయించారట. అయితే ఆ 15 కోట్లలో నటీనటుల పారితోషకాలు లేవట. నటీనటుల పారితోషకాలు కూడా ఓ అన్నంత లేకుండా నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారట. ఎందుకంటే బెల్లంకొండకి సూపర్ హిట్ లేదు. హీరోయిన్ అనుపమ వరస ప్లాప్స్ తో ఉంది. ఇక దర్శకుడు రమేష్ వర్మ కూడా సాదా సీదా డైరెక్టర్. అందుకే బడ్జెట్ ని కంట్రోల్ చేశారట. అందులోను బెల్లంకొండ సినిమాలను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్ బెట్టు చేయడంతో.. ఈసారి బడ్జెట్ కంట్రోల్ చేసి మరీ సినిమాని తెరకెక్కించి తక్కువ ధరలకే డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మాలనే ప్లాన్ లో రాక్షసుడు టీం ఉందట. 

15 Crores Budget to Rakshasudu Movie:

No Remunerations to Rakshasudu Movie Cast
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs