Advertisement
Google Ads BL

ఆర్ఆర్ఆర్ కంటే ముందే ‘సీతారామరాజు’ కథ


రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో నిర్మాణంలో పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో ‘సీతారామరాజు’ - ఏ ట్రూ వారియర్  

Advertisement
CJ Advs

రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో నిర్మాణంలో సునీల్ కుమార్ రెడ్డి  దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సీతారామరాజు’ - ఏ ట్రూ వారియర్. మన్యంలో జరుగుతున్న తెల్లదొరల ఆకృత్యాలకు నిరసనగా విప్లవ బావుటా ఎగరవేసిన పాతికేళ్ల కుర్రాడి పోరాట గాథను ఉత్తమ సాంకేతిక విలువలతో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం ప్రెస్ మీట్ ఫిలిం చాంబర్ లో జరిగింది. 

ఈ సందర్భంగా రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో అధినేత డా. శ్రీనివాస్ మాట్లాడుతూ..  ‘‘సొంతూరు, గంగపుత్రులు, గల్ఫ్ వంటి సామాజిక చిత్రాలను.... రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ వంటి యూత్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన పి. సునీల్ కుమార్ రెడ్డి లాంటి సక్సెస్ ఫుల్ దర్శకుడితో ‘సీతారామరాజు’ - ఏ ట్రూ వారియర్ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అల్లూరి సీతారామరాజు బయోపిక్ తీయడం చిన్న విషయం కాదు. దానికి కావాల్సిన సీజీ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం. మా రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో శ్రావ్యఫిలింస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మేం ఎడ్యుకేషన్ రంగంలో 27 సంవత్సరాలుగా ఉన్నాం. ఏవియేషన్, హోటల్ మేనేజ్ మెంట్ విద్యను చాలా మందికి అందించాం. ఇప్పుడు ఫిల్మ్ అకాడమీని వైజాగ్‌లో ప్రారంభించాం. థియరీ క్లాసులతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా విద్యను అందించడమే మా టార్గెట్. అందుకే సీతారామరాజు అనే సినిమా తీస్తున్నాం. ఈ సినిమా కోసం మా విద్యార్థులు కూడా పనిచేయనున్నారు. 7.1 స్టూడియోతో పాటు టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో స్టూడియో నిర్మాణం చేశాం. విద్యను అందించడమే కాదు.. ఎలాంటి సినిమాకైనా సరే పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునే సదుపాయం రిసాలీ స్టూడియోలో ఉంది. ప్రతీ సంవత్సరం రెండు చిత్రాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం..’’ అని అన్నారు. 

దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ వసతులతో స్టూడియో ఏర్పాటు చేసిన రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో అధినేత శ్రీనివాస్ గారితో కలిసి శ్రావ్యఫిలింస్ బ్యానర్లో సీతారామరాజు వంటి బయోపిక్ తీయడం చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్లో మేకింగ్ పరంగా, కంటెంట్ పరంగా, బడ్జెట్ పరంగా చాలా పెద్ద సినిమా. అప్పటి చరిత్రతో ఇప్పటి యువతకి స్ఫూర్తి నింపేలా అల్లూరి సీతారామరాజు త్యాగం, ఆయన కీర్తిని మరింత ఇనుమడింపజేసే దిశగా ‘సీతారామరాజు’ - ఏ ట్రూ వారియర్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.  విశాఖ, కాకినాడ, రాజమండ్రి, ఏజెన్సీ‌ల పరిసర ప్రాంతాల్లో సింహ భాగం షూటింగ్ జరుపుకునే ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్, సాబు జేమ్స్ వంటి సీనియర్ సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తుంది. రావ్ రమేష్ వంటి సీనియర్ నటీనటులతో పాటు... నూతన నటీనటులు కూడా ఇందులో నటిస్తారు. మేలో షూటింగ్ ప్రారంభమౌతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాట నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఉన్న గ్రాఫిక్స్ వర్క్ కు సంబంధించిన సీజీ వర్క్ ఇప్పటికే జరుగుతోంది. రీజినల్ హీరోను నేషనల్ స్థాయిలో చూపించాలనేదే నా తపన. త్వరలో సాంకేతిక నిపుణులు, నటీనటుల పూర్తి వివరాలు తెలియజేస్తాం’’ అని అన్నారు.  

నిర్మాత యెక్కలి రవీంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్లో ఇది చాలా పెద్ద సినిమా. రిసాలి వంటి పెద్ద సంస్థతో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సునీల్ కుమార్ రెడ్డి గారు ఏ సినిమా చేసినా చాలా రీసెర్చ్ వర్క్ చేస్తుంటారు. అలాంటి అల్లూరి సీతారామరాజు బయోపిక్ చేస్తున్నప్పుడు ఏ విధమైన గ్రౌండ్ వర్క్ చేస్తారో ఊహించొచ్చు. ఈ సినిమాను పెద్ద స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆయన నుంచి ఓ అద్భుతమైన సినిమా వస్తుందని ఆశిస్తున్నాను..’’ అని అన్నారు. 

సాంకేతిక నిపుణులు

సమర్పణ - రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో

బ్యానర్ - శ్రావ్య ఫిలింస్

ఎడిటర్ - మార్తాండ్ కె. వెంకటేష్

సినిమాటోగ్రాఫర్ - సాబు జేమ్స్

నిర్మాత - డా.శ్రీనివాస్

సహ నిర్మాతలు - యెక్కలి రవీంద్రబాబు, 

రచన, దర్శకత్వం - పి. సునీల్ కుమార్ రెడ్డి.

P Suneel Kumar Reddy Next Film is a Biopic:

Alluri Seetharama Raju biopic to go on floors in March
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs