Advertisement
Google Ads BL

నిత్యా.. వేదన వినకుండా బ్యాన్ అంటున్నారు


గ్లామర్ లేకపోయినా.. అందం నటనతోనే ప్రేక్షకులను మెప్పించే అతికొద్దిమంది నటీమణుల్లో నిత్యామీనన్ ఒకరు. లిప్ కిస్సెస్ కి, గ్లామర్ షో కి నో చెప్పే నిత్యా మీనన్ కి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోయినా.. వచ్చిన అవకాశాలతోనే తన టాలెంట్‌ని నిరూపించుకుంటుంది. తెలుగులో ఓ అన్నంత ఆఫర్స్ లేకపోయినా.. మలయాళంలో నిత్యా మాత్రం బిజీ. తాజాగా టాలీవుడ్‌లో రాజమౌళి తెరకెక్కించబోయే RRR కోసం నిత్యా మీనన్ పేరుని హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారని.. దాదాపుగా ఎన్టీఆర్‌కి సెకండ్ హీరోయిన్‌గా నిత్యా ఫిక్స్ అంటూ వార్తలొస్తున్నాయి. RRR‌లో ఎన్టీఆర్‌ని ఆరాధించే పాత్రలో నిత్య నటించబోతుందనే న్యూస్ ప్రచారంలో ఉన్నవేళ నిత్యా మీనన్‌పై ఇప్పుడొక న్యూస్ షాకిస్తుంది.

Advertisement
CJ Advs

అదేమిటంటే మలయాళ దర్శక‌నిర్మాతలు నిత్యా మీనన్‌ని బ్యాన్ చేయాలని చూస్తున్నారట. ఎప్పటినుండో నిత్యా మీనన్ మీద.. దర్శకులను గౌరవించదని.. సినిమా మేకింగ్ విషయంలో నిత్యా వేళ్ళు పెడుతుందనే న్యూస్ ఉంది. తాజాగా నిత్యా మీనన్‌ని తమ సినిమాల్లో బుక్ చేసుకోవడాకి.. ఆమె ఇంటికి వెళితే నిత్యా మాత్రం ఆ దర్శకులను కలవకుండా ఇబ్బంది పెడుతుందట. ఇక ఇలాంటివి కోకొల్లలుగా జరిగేసరికి దర్శకనిర్మాతలకు విసుగొచ్చి... ఆమెని బ్యాన్ చెయ్యాలని.. నిర్మాతల మండలిలో నిత్యా విషయమై చర్చించి నిర్ణయం తీసుకోబోతుననట్లుగా సమాచారం. 

అయితే ఈ విషయమై నిత్యా స్పందిస్తూ.. తన తల్లికి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నానని.. అలాంటి సమయంలో తానూ షూటింగ్స్ కి హాజరవుతున్నానని.. కానీ నిర్మాతలు తనతో అలాంటి సమయంలో మాట్లాడడానికి వస్తే.. తాను ఏడుస్తూ మాట్లాడాల్సి వస్తుందని వాళ్ళని అవాయిడ్ చేసానని.. నేను నా తల్లికి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ సినిమాల షూటింగ్స్‌కి వెళుతున్నానని.. తనని మలయాళ ఇండస్ట్రీ నుండి పంపించడానికి కొందరు కుట్ర చేస్తున్నారని నిత్యా మీనన్ ప్రధాన ఆరోపణ. తల్లికి బాగోక మానసిక సంఘర్షణకు లోనవుతున్న టైం లో సినిమాల్లో నటించడంపై ఆసక్తి లేదని అందుకే వాళ్లతో మాట్లాడలేకపోయానని చెబుతుంది నిత్యా.

Nithya Menon in Troubles:

Malayalam Film Industry Serious on Nithya Menon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs