హీరో నాని లేటెస్ట్ సెన్సేషన్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ మూవీ ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబడుతుంది. మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ 10రోజుల్లో అక్కడా 1.23 మిలియన్ డాలర్లను రాబట్టింది. సో.. దాంతో ఈ చిత్రం నాని కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది. మొదటి స్థానంలో ‘భలే భలే మగాడివోయ్’ 1.43 మిలియన్ డాలర్ల వసూళ్లతో ఉంది.
అయితే ఫుల్ రన్ లో ఈ చిత్రం ‘భలే భలే మగాడివోయ్’ వసూల్ ని క్రాస్ చేయడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ నుండి తీవ్రమైన పోటీ ఎదురవుతుంది. అక్కడ ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే. చాలా స్క్రీన్స్ లో ‘జెర్సీ’ సినిమా తీసేసి ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ వేశారంటే ‘జెర్సీ’ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఈ సినిమా పరిస్థితి మారింది. సూపర్ హిట్ టాక్ తో రికార్డు కలెక్షన్స్ ను వసూల్ చేస్తుంది అనుకుంటే కేవలం ఏ సెంటర్లలో మాత్రమే మంచి రన్ ను కనబరుస్తుంది. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపించడం లేదు. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నా.. వసూళ్ల విషయంలో డల్ అవ్వడం ఆశ్చర్యమే.