Advertisement
Google Ads BL

‘మహర్షి’ పెద్ద సునామీని తప్పించుకున్నాడు


మహేష్ బాబు - వంశీ పైడిపల్లిల మహర్షి సినిమా ముందుగా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న విడుదల చేద్దామని నిర్మాత దిల్ రాజు చెప్పాడు. అయితే మహర్షి షూటింగ్ లేట్ కావడంతో... అది కాస్తా ఏప్రిల్ 25న విడుదల చేస్తామని మళ్ళీ దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు. అయినా మహర్షి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నిటికి ఎక్కువ టైం పట్టేలా ఉందని.. కామ్ గా గత ఏడాది మహానటి విడుదలైన మే 9న ఫైనల్‌గా మహర్షి కి విడుదల డేట్ ఫిక్స్ చేసిన దిల్ రాజు.. అక్కడ మహానటి మే 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కనుక ఆ డేట్ కి వస్తున్నామంటూ సెంటిమెంట్ ఒలకబోశాడు.

Advertisement
CJ Advs

నిజంగా దిల్ రాజు సెంటిమెంట్ అంటూ బిల్డప్ ఇచ్చినప్పటికీ.. ఏప్రిల్ 25 నుండి తమ సినిమాని మే 9 కి పోస్ట్ ఫోన్ చేసి మహేష్ మహర్షి టీం మంచి పని చేసింది. లేదంటే ఏప్రిల్ 26‌న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులముందుకు వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ తాకిడికి మహేష్ తోకముడవాల్సి వచ్చేది. అసలే 140 కోట్ల బిజినెస్ జరుపుకుని.. భారీగా రంగంలోకి దిగడానికి సిద్దమవుతుంది మహర్షి. మరి నిజంగా దిల్ రాజు అవెంజర్స్‌కి భయపడి పోస్ట్ పోన్ చేసాడో లేదా.. నిజంగానే సెంటిమెంట్ కి తలొగ్గాడో కానీ.. అవెంజర్స్ ఎండ్ గేమ్ కి బలికాకుండా బయటపడ్డారు. 

మరి అవెంజర్స్ క్రేజ్ ఎలా ఉందో గత నాలుగు రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అంటే ఫస్ట్ వీకెండ్‌కే 8500 కోట్లు కొల్లగొట్టి.. రికార్డులను సృష్టించడానికి అవెంజర్స్ ఎండ్ గేమ్ రెడీ అవుతుంటే.... సోమ మంగళ వారాల్లోనూ అవెంజర్స్ ఎండ్ గేమ్ హవా ఇంకా కొనసాగుతుంది. మరి అవెంజర్స్ ఎండ్ గేమ్ సునామీలో మహర్షి కొట్టుకుపోకుండా జాగ్రత్తపడిందనే చెప్పాలి.

Mahesh Maharshi Escapes From Big Threat:

Maharshi Safes From Avengers Tsunami
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs