Advertisement
Google Ads BL

‘మహేష్ 26’ వార్తలు ఎక్కువైనాయ్!


వరుసగా రెండు మూడు పరాజయాల తర్వాత మహేష్‌బాబు మరలా శ్రీమంతుడు, భరత్‌ అనే నేను చిత్రాలతో పెద్ద హిట్స్‌ కొట్టాడు. ప్రస్తుతం ఆయన తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా మహర్షి చిత్రం చేస్తున్నాడు. ఇందులో పూజాహెగ్డే , అల్లరి నరేష్‌లు ప్రధానపాత్రలు పోషిస్తుండగా.. దిల్‌రాజు, అశ్వనీదత్‌, పివిపి వంటి భారీ నిర్మాతలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వంశీపైడిపల్లి దీనికి సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ మహర్షి చిత్రాన్నిమొదట ఏప్రిల్‌ 5, తర్వాత ఏప్రిల్‌ 25న విడుదల చేయాలని భావించి, వాయిదా వేశారు. ఈ మూవీ మే 9న విడుదల కానుంది. నిజంగా మహర్షిని మే 9కి లాక్‌ చేయడమే ఈ చిత్రానికి మేలు చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఏప్రిల్‌ 25న ఈ చిత్రాన్ని విడుదల చేసి ఉంటే ఎవేంజర్స్‌ రూపంలో పెద్ద పోటీ వచ్చి ఉండేది. సాధారణ తెలుగు చిత్రాలకంటే, స్టార్‌ హీరోల చిత్రాలకు ధీటుగా ఎవెంజర్స్‌ పోటీ ఉంది. మే 9వ తేదీ అంటే అప్పటికి ఎవేంజర్స్‌ మూవీ విడుదలై రెండు వారాలు అవుతుంది కాబట్టి ఆ ఊపు ఉండదు. కాబట్టి పోటీ లేకపోవడం, కావాల్సినన్ని థియేటర్లు లభించడం, సోలో రిలీజ్‌ కావడం వంటివి మహర్షికి ప్లస్‌ అవుతాయి. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం తర్వాత మహేష్‌, దిల్‌రాజు-అనిల్‌సుంకర కాంబినేషన్‌లో ఎఫ్‌2 ఫేమ్‌ అనిల్‌రావిపూడి దర్శకత్వంలో చిత్రం చేస్తున్నాడు. ఇది మహేష్‌ 26వ చిత్రం కానుంది. ఇందులో రష్మికా మందన్న హీరోయన్‌గా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇక ఎంతో కాలంగా సినిమాల నుంచి బయటకు వచ్చి రాజకీయ నాయకురాలిగా మారిన విజయశాంతి ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందన్న మాట సంచలనంగా మారింది. ఇక ఇందులో జగపతిబాబుతో పాటు తనదైన పాత్రలను అద్భుతంగా పోషించి రక్తి కట్టించే శివగామి రమ్యకృష్ణ మరో కీలకపాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. 

విశేషం ఏమిటంటే గతంలో జగపతిబాబు, విజయశాంతితో ఆశయం, రమ్యకృష్ణతో ఆయనకు ఇద్దరు వంటి పలు చిత్రాలు చేసి ఉన్నాడు. ఇలా ఈ ముగ్గురు కలిసి మహేష్‌ 26వ చిత్రంలో నటిస్తున్నారన్న వార్త నిజమైతే ఇక ఈ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడటం ఖాయమని చెప్పాలి. మహర్షి హడావుడి పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఎలాగైనా వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 

Mahesh Babu 26 Film Trending in Social Media:

Top Celebrities in Mahesh 26 film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs