Advertisement
Google Ads BL

జగపతి బాబు మరోసారి సత్తా చాటుతాడా?


సినిమా వారికి పోలీస్‌ స్టోరీలు అనేవి చాలా ఇష్టం. వీటిలో కమర్షియల్‌, మాస్‌మసాలా, సాంగ్స్‌, ఫైట్స్‌, అరివీరభయంకరమైన డైలాగ్స్‌.. ఇలా సామాన్య ప్రేక్షకులు, మాస్‌ ఆడియన్స్‌, హీరోల అభిమానులను శాటిస్‌ఫై చేసే అంశాలను ఏర్చి కూర్చవచ్చు. ఇక విషయానికి వస్తే పోలీస్‌ స్టోరీలు అందరికీ సూట్‌ కావు. మెగాస్టార్‌ చిరంజీవి ఒకానొక దశలో బాలయ్య కంటే హై రేంజ్‌లో మెగాస్టార్‌గా ఉన్న సమయంలో కూడా ఆయన పోలీస్‌ పాత్రలు పోషించిన చిత్రాలు బాగా ఆడలేదు. ఇక తెలుగులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోగా రాజశేఖర్‌కి పేరుంది. కానీ ఆయన వేసే పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రకు సాయికుమార్‌ డబ్బింగ్‌ లేకపోతే తుస్సుమంటుంది. అయినా రాజశేఖర్‌ పెద్ద స్టార్‌ కాదు. టాప్‌ స్టార్స్‌లో కేవలం బాలయ్యకు మాత్రం పోలీస్‌ పాత్రలు బాగా కలిసి వస్తాయి. 

Advertisement
CJ Advs

నాగార్జున శివమణి, వెంకటేష్‌ ఘర్షణ, సూపర్‌పోలీస్‌, చిరంజీవి ఎస్పీపరుశురాం వంటి చిత్రాలు చేసినా ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌ నుంచి రౌడీ ఇన్‌స్పెక్టర్‌, లక్ష్మీనరసింహ వరకు బాలయ్య పోలీస్‌గా అదరగొట్టాడు. ఇక విషయానికి వస్తే తాజాగా తమిళ సీనియర్‌ డైరెక్టర్‌ కె.యస్‌.రవికుమార్‌, సి.కళ్యాణ్‌ నిర్మాతగా ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో బాలయ్య ప్రత్యర్ధుల గుండెల్లో నిదురపోయే రౌడీపోలీస్‌గా కనిపిస్తాడట. కె.యస్‌.రవికుమార్‌కి కూడా పోలీస్‌ పాత్రను బాగా తీసే నేర్చు ఉంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య పాత్ర పేరు రంజిత్‌కుమార్‌ రాణా అని తెలుస్తోంది. బాలయ్య తండ్రి ఎన్టీఆర్‌ కొండవీటి సింహం చిత్రంలో రంజిత్‌కుమార్‌గా నటించి మెప్పించాడు. 

ఇక యువరత్న రాణా చిత్రంలో బాలయ్య నటించగా ఈ చిత్రం ఫ్లాప్‌ అయింది. ఇలా ఇందులో బాలయ్య పాత్రకు ఆయనకు నచ్చిన పవర్‌ఫుల్‌ టైటిల్‌ని పెట్టనున్నారని సమాచారం. మరోవైపు లెజెండ్‌ చిత్రంలో బాలయ్యకు పోటాపోటీగా జగపతిబాబు విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటివరకు హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఏ అవకాశం వస్తే అందులో నటిస్తూ వచ్చిన జగ్గుభాయ్‌ కెరీర్‌ని లెజెండ్‌ మలుపు తిప్పింది. ఈ చిత్రం పుణ్యమా అని జగపతిబాబు తెలుగులోనే కాక తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో కూడా చాన్స్‌లు దక్కించుకుంటున్నాడు. మరి పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తున్న బాలయ్యకి పోటాపోటీగా ఇందులో జగపతిబాబు పాత్ర ఉంటుందని సమాచారం.

Jagapathi Babu in Balakrishna and KS Ravi Kumar Film:

Again Jagapathi Babu Villain in Balayya Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs