రెండు భారీ డిజాస్టర్స్ తర్వాత మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా విడుదలవుతుంది అంటే... ఆ సినిమా మీద విపరీతమైన క్రేజ్ ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ ఏర్పడింది. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల భారీ డిజాస్టర్ తర్వాత కొరటాలతో భరత్ అనే నేను చేస్తే.. మరి కొరటాల - మహేష్ హిట్ కాంబో గనక భరత్ మీద భారీ క్రేజ్ వచ్చింది. కానీ... భరత్ అనే నేను హిట్ తర్వాత వస్తున్న మహర్షి సినిమా మీద మునుపటి క్రేజ్ కనబడడం లేదు. మే 9 న అంటే మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న మహర్షి సినిమా మీద ప్రేక్షకుల్లో కానీ.... ట్రేడ్ లో కానీ అస్సలు ఆసక్తి కనిపించడంలేదు. ఒక్కో పాట మార్కెట్ లోకి విడుదలవుతున్నా.. ఆ పాటల మీద ప్రేక్షకులు ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. మరి దేవిశ్రీ అందించిన మ్యూజిక్ అలా వుంది.
ఇక ఒకప్పుడు స్టార్ హీరో సినిమా విడుదలవుతుంది అంటే చాలు జనాల్లో ఎంతో ఆసక్తి కనిపించేది... మరి మహర్షి విషయంలో అంతగా బజ్ రాకపోవడానికి.. కారణం ఏమిటో అంతుచిక్కడం లేదు. ఈ సినిమా పాటల్లో శ్రీమంతుడు స్టయిల్ కనబడుతుంది అని ఒకరు.. మహేష్ - పూజా హెగ్డే కాంబోని చూసిన శృతి హాసన్, మహేష్ ల కాంబోలాగే ఉంది కానీ... కొత్తగా ఏం లేదంటున్నారు. అలాగే శ్రీమంతుడులోని డాన్స్ లే మహేష్, మహర్షిలోను కనబడుతున్నాయనే టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. మహర్షి టీజర్ చూసినా, పాటలు విన్నా శ్రీమంతుడు సినిమా గుర్తుకు రావడమే మహర్షికి మైనస్ గా మారిందని.. ప్రమోషన్స్ లో మంచి వేరియేషన్స్ చూపిస్తే సినిమా మీద ఇంట్రెస్ట్ కలుగుతుందని అంటున్నారు. మరి వంశి పైడిపల్లి ఇంతవరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా ఏ హీరోకి ఇవ్వలేదు. మరి ఇప్పుడైనా మహేష్ కి బ్లాక్ బస్టర్ ఇస్తాడో లేదంటే... యావరేజ్ ఇస్తాడో చూద్దాం .