Advertisement
Google Ads BL

రానా ఆల్‌మోస్ట్‌ ఏడిచినట్టున్నాడు : నాని


‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ మా టీమ్‌కి స్పెషల్‌గా ఉంటుంది. ‘అందరూ పాతబడిపోవచ్చు కానీ, ‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ పాతబడిపోదు. చాలా చాలా స్పెషల్, ప్రౌడ్‌ సినిమాగా మిగిలిపోతుంది’ అని నాని అన్నారు. ఆయన హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ  నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల అయింది. నాటి నుంచి అప్రతిహతంగా చిత్ర విజయం సరికొత్త రికార్డ్ లను నెలకొల్పుతోంది.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్‌’లో నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ– ‘జెర్సీ’ రిలీజ్‌ తర్వాత నాకు వచ్చిన మెసేజెస్‌ కానీ, ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు సినిమా గురించి, నటన, టెక్నీషియన్స్‌ గురించి మాట్లాడుతున్న విధానం కానీ.. నేనెప్పుడూ ఎక్స్‌పీరియన్స్‌ చేయని ఒక ఫీలింగ్‌. ఏ సినిమాకైనా తొలి మూడు రోజులు బోల్డన్ని మెసేజ్‌లు, ఫీడ్‌బ్యాక్‌ వస్తుంటాయి. వారం తర్వాత ఆ ఫీడ్‌బ్యాక్‌ తగ్గుతూ ఉంటుంది. కానీ ‘జెర్సీ’ కి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఏ రోజుకారోజు మెసేజ్‌లతో మా ఫోన్లు నిండిపోతున్నాయి. రివర్స్‌లో మాకు థ్యాంక్యూ మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే టీమ్‌ అందరి తరుపున ఒక ఫైనల్‌ థ్యాంక్యూ చెప్పాలని ఈ మీట్‌ ఏర్పాటుచేశాం. చాలా ఎమోషన్‌ ఉన్న సినిమా కదా రిపీట్‌గా చూసేవాళ్లకి ఎలా ఉంటుందనుకున్నాం. కానీ, చాలా మంది మళ్లీ మళ్లీ చూసి మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి వీటిని మెసేజ్‌లు అనలేను.. ఎందుకంటే ఓ చిన్న లవ్‌లెటర్స్‌లా ఉన్నాయి.. అందరికీ థ్యాంక్యూ సోమచ్‌. ‘జెర్సీ’ సినిమా చూసిన రానా కాల్‌ చేసినప్పుడు ఆ వాయిస్‌ నాకు గుర్తుంది.. వాడు(రానా) ఆల్‌మోస్ట్‌ ఏడిచినట్టున్నాడు.. కచ్చితంగా రానాను ఈ ఫంక్షన్‌కి పిలుద్దామనుకున్నా. లాస్ట్‌ మినిట్‌లో ఫోన్‌ చేసినా వస్తాడులే అన్న నమ్మకం.. ఎందుకంటే వాడికి సినిమా ఎంత నచ్చిందో నాకు తెలుసు. మా కష్టానికి అంత రెస్పెక్ట్‌ చూపించిన ప్రేక్షకులందరికీ, మీడియాకి థ్యాంక్స్‌’’ అన్నారు.  

హీరో రానా మాట్లాడుతూ– ‘‘నేను సక్సెస్‌ మీట్‌కి వచ్చి చాలా రోజులు అయింది. కానీ, ‘జెర్సీ’ సినిమాకి రావాలనుకున్నా. ఎందుకంటే.. నాకు లైఫ్‌లో బేసిక్‌గా కొన్ని అర్థంకావు. క్రికెట్, పెళ్లి, అమ్మాయిలు, పిల్లలు. ఇవన్నీ అర్థం కాని నాకే ఈ సినిమా చూసి ఏడుపు వచ్చిందంటే ప్రేక్షకుల పరిస్థితి ఏమై ఉంటుందో నాకు తెలుసు. నాని నటన సూపర్‌. ప్రతిరోజు నాకు స్ఫూర్తినిస్తుంటాడు. వారంలో మూడు సార్లు తనని చూస్తాను. అయినా కానీ సినిమాపై అతనికి ఉన్న ప్రేమ చూస్తే ఎంతో కొత్తగా చేయాలని స్ఫూర్తినిస్తూ ఉంటుంది. గౌత‌మ్ స్టోరీ టెల్ల‌ర్‌గా.. ఫిలింమేక‌ర్‌గా జెర్సీతో అంద‌రినీ ట‌చ్ చేశాడు. యు టర్న్ నుండి శ్ర‌ద్ధాశ్రీనాథ్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని.  ‘జెర్సీ’ కి పనిచేసిన వారందరికీ చెబుతున్నా. సినిమా అన్నది శాశ్వతం.. అందులో ‘జెర్సీ’ సినిమా కోసం ఎప్పుడూ ఒక పేజీ తప్పకుండా ఉంటుంది అన్నారు. ఎంటైర్ టీంకు ఇదొక మెరిట్‌లా మిగిలిపోతుంది’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు గౌతమ్‌ తిన్ననూరి మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి వచ్చిన అభినందనలకు అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాను నాకు చేసే అవ‌కాశం క‌ల్పించిన నిర్మాత‌లు పిడివి. ప్ర‌సాద్‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ గారికి, సినిమా కోసం వ‌ర్క్‌చేసిన ప్ర‌తి ఒక ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్‌కి థాంక్స్‌. నాని సార్‌కి స్పెష‌ల్ థాంక్స్‌. శ్ర‌ద్ధాశ్రీనాథ్‌కి థాంక్స్‌. నా డైరెక్ష‌న్ టీం ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. సినిమాను చూడ‌ని వాళ్లు ఎవ‌రైనా ఉంటే.. చూడమ‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

హీరోయిన్ శ్ర‌ద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ  - ‘‘ఈ రోజు ఏం చెప్పాలో తెలియ‌డం లేదు. థాంక్యూ చెబితే స‌రిపోదు. ప్రేక్ష‌కులు చూపించిన ప్రేమ‌కు థాంక్స్‌. ఇంకా మంచి సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. సారా క్యారెక్ట‌ర్ చేయ‌డం ఆనందంగా ఉంది. సింగిల్ ఫాద‌ర్స్‌కు, సింగిల్ మ‌ద‌ర్స్‌కు .. ఈ సినిమాను అంకితం చేస్తున్నాను’’ అన్నారు.  

విశ్వంత్ మాట్లాడుతూ - ‘‘సినిమా ఓ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. డైరెక్ట‌ర్ గౌత‌మ్ తొలి సినిమా నుండి ప‌రిచ‌యం. ఒక‌ప్ప‌టితో పోల్చితే ఇప్పుడు త‌ను న‌వ్వుతున్నాడు. ఓ మంచి సినిమా చూసిన‌ప్పుడు చాలా శాటిస్పాక్ష‌న్ క‌లుగుతుంది. అదే అలాంటి సినిమాలో పార్ట్ అయితే ఆ ఆనందం రెండు, మూడు రెట్లు ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి అనుభూతిని ఇచ్చిన సినిమా ఇది’’ అన్నారు. 

పాట‌ల ర‌చ‌యిత కృష్ణ కాంత్ మాట్లాడుతూ - ‘‘న‌న్ను న‌మ్మి నాకు ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చిన గౌత‌మ్‌కి వంద‌సార్లు థాంక్స్ చెప్పినా స‌రిపోదు. అలాగే త‌మిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయిన అనిరుధ్ ఈ సినిమాలో నాతో సింగిల్ కార్డ్ రాయించినందుకు త‌న‌కు కూడా థాంక్స్‌. ఓ మంచి సినిమాను.. మాస్ట‌ర్ పీస్‌లాంటి సినిమా కోసం పాటు ప‌డ్డ నానిగారికి థాంక్స్‌. మంచి సినిమాను మిస్ కాకుండా చూడండి’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు పీడీవీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిత్ర నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్ లకు ప్రముఖ కదా నాయకుడు రాణా, హీరో నాని, దర్శకుడు గౌతమ్, చిత్ర సమర్పకుడు పిడివి ప్రసాద్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ  జ్ఞాపికలను బహుకరించారు. 

Jersey Thanks Meet Details:

Celebrities Speech at Jersey Thanks Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs