Advertisement
Google Ads BL

‘కబీర్‌సింగ్‌’ కూడా యాటిట్యూడ్‌ చూపుతున్నాడు


టాలీవుడ్‌లో తను మాట్లాడే స్టైల్‌, యాటిట్యూడ్‌తో కూడా విపరీతంగా ప్రేక్షకులను మరీ ముఖ్యంగా యూత్‌ని ఆకట్టుకోవచ్చని నిరూపించిన రౌడీస్టార్‌ విజయ్‌ దేవరకొండ, పెళ్లిచూపులు వరకు అందరిలాగే ఉన్న ఆయన అర్జున్‌రెడ్డి విడుదలకు ముందు మాత్రం తాను చేసిన ప్రసంగాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు, వేడుకలోనే వాడిన బూతులు, మాట్లాడిన విధానం వల్ల అనూహ్యంగా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలోనే షాహిద్‌ కపూర్‌, కైరా అద్వాని జంటగా ‘కబీర్‌సింగ్‌’గా రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రం జూన్‌ 21న విడుదల కానుంది. కానీ అదే రోజు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో కంగనారౌనత్‌, రాజ్‌కుమార్‌రావులు నటించిన ‘మెంటల్‌ క్యాహై’ కూడా విడుదల కానుంది. దీని గురించి షాహిద్‌కపూర్‌ మాట్లాడుతూ, ముందుగా ఆ డేట్‌ని లాక్‌ చేసుకుంది మేమే. మెంటల్‌ క్యాహై డేట్‌ మార్చుకుని మా డేట్‌కి వచ్చారు. బంతి ఇప్పుడు వారి కోర్టులోనే ఉంది. అయినా వారికి కూడా ఆల్‌ది బెస్ట్‌. 

Advertisement
CJ Advs

కబీర్‌సింగ్‌ కోసం మేం బెస్ట్‌ ఇచ్చాం. రిజల్ట్‌ ఎలా ఉండబోతోందో మాకు తెలుసు. సినిమా బాగుంటేనే ఆడియన్స్‌ సినిమా చూస్తారు. లేకపోతే చూడరు. సోలో రిలీజ్‌ అయినా పోటీలో రిలీజ్‌ అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది అంటున్నాడు. అర్జున్‌రెడ్డి విడుదల సమయంలో ఆ చిత్రం గురించి ఇంతే కాన్ఫిడెంట్‌గా విజయ్‌ దేవరకొండ కూడా మాట్లాడాడు. సినిమా ఫలితంపై ముందు నుంచి ధీమా వ్యక్తం చేస్తూనే వచ్చాడు. మొదట్లో కొందరు ఏంటి ఈ కుర్ర హీరో ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు? అని విమర్శలు కూడా చేశారు. కానీ ఆ తర్వాత విషయం అందరికీ అర్ధం అయింది. ఇప్పుడు షాహిద్‌ కపూర్‌లో కూడా ఇదే కాన్ఫిడెన్స్‌ కనిపిస్తోంది. మరి రిజల్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి. 

ఇంకా షాహిద్‌ కపూర్‌ ‘కబీర్‌సింగ్‌’ గురించి మాట్లాడుతూ, అర్జున్‌రెడ్డిలో విజయ్‌దేవరకొండ నటన అద్భుతం. మీరు నన్ను అడిగితే అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్‌లు ఒకటి కాదు. వారిద్దరు కజిన్స్‌ అని చెబుతాను. మేం ఈ సినిమాలో కొంత కొత్తగా ట్రై చేశాం. ఎందుకంటే సినిమా నేపధ్యం ఢిల్లీకి, ముంబైకి మారింది. దాంతో హీరో పెరిగే వాతావరణం కూడా మారుతుంది. అందువల్ల ఆయన ప్రయాణం కూడా కొంత మారుతుంది. కానీ ఆ పాత్రలో ఉన్న బేసిక్‌ ఎనర్జీని మాత్రం అలానే ఉంచాం అని తెలివిగా మాట్లాడాడు. 

ఎందుకంటే కమర్షియల్‌ చిత్రాలను రీమేక్‌ చేసేటప్పుడు పెద్దగా తేడా ఉండదు. అదే ఏదైనా కల్ట్‌ సినిమాని రీమేక్‌ చేయాలంటే మాత్రం ఎన్నో అవరోధాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ పోలికలు వస్తాయి. ఒరిజినల్‌ని శ్రద్దగా ఫాలో అయితే కాపీ, జెరాక్స్‌ అంటారు. ఒకవేళ కొంచెం మార్చినా చెడగొట్టారు అంటారు. ఇదే తమిళ వర్మ విషయంలో వివాదం బాలాని తొలగించే వరకు వెళ్లింది. మరి ఈ కత్తి మీద సాముని సందీప్‌రెడ్డి వంగా, షాహిద్‌కపూర్‌లు ఎలా చేసి మెప్పిస్తారో చూడాలి...! 

Kabir Singh Follows Arjun Reddy:

Shahid kapoor Talks About Kabir Singh Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs