Advertisement
Google Ads BL

ఆ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్న మహేష్!


రాష్ట్రం విడిపోకముందు అందరు అంత పెద్దగా ఏ చిత్రం షూటింగ్‌ రాష్ట్రంలో ఎక్కడ జరిగింది? ప్రీరిలీజ్‌ ఈవెంట్లు, సక్సెస్‌మీట్‌లు ఎక్కడ చేశారు? వంటివి పట్టించుకునేవారు కాదు. కారణం మొత్తం సమైక్యాంధ్ర కావడమే. కానీ రాష్ట్రం తెలంగాణ, ఏపీలుగా విడిపోయిన తర్వాత మాత్రం ఏపీ ప్రజలు సినిమా వారు విజయంలో అగ్రపీఠం వేసే తమకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు? అనేది ఏపీలో జరిగే సినీ వేడుకలు, ఆయా సినిమాల విషయంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అన్నట్లుగానే ఈ మధ్య తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, భీమవరం వంటి చోట్ల కూడా వేడుకలను జరుపుతున్నారు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే ప్రస్తుతం చాలా చిత్రాల ప్రమోషన్‌ ఈవెంట్స్‌ని కేవలం సమయాభావం వల్లనో, ఇతర వ్యయప్రయాసాల వల్లనో కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేస్తున్నారు. కానీ మహేష్‌ పరిస్థితి వేరు. ఆయన తన కెరీర్‌లో ‘ఒక్కడు, దూకుడు’ చిత్రాల వేడుకలను విజయవాడలో జరిపించాడు. ఇక విషయానికి వస్తే మహేష్‌ ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా ‘మహర్షి’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్‌ బాగానే ఆకట్టుకున్నాయి. కానీ టీజర్‌ మాత్రం మహేష్‌ మసాలా సినిమాలను గుర్తు చేసేలా సాగింది. ఇక మొదటి పాటకి దేవిశ్రీ గొంతు బాగా లేదని, రెండో సాంగ్‌ రొటీన్‌గా ఉందని, మూడో డ్యూయెట్‌ని దేవిశ్రీ ఇలాంటి ట్యూన్‌ ఇచ్చాడేమిటబ్బా? అంటూ విమర్శలు వచ్చాయి. 

ఇక తాజాగా వచ్చిన పదరా సాంగ్‌ మాత్రం ఫర్వాలేదనిపించింది. అయితే పాటలోని మహేష్‌ మోడ్రన్‌ రైతు గెటప్‌, ఇతర విషయాలు చూసిన వారు శ్రీమంతుడులా ఉన్నాడని, ‘భరత్‌ అనే నేను’ స్టైల్లో పాట సాగిందని విమర్శించారు. మొత్తానికి వీటన్నింటికి చెక్‌పెడుతూ మే 1న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చేయనున్నారు. ఇక ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ని విజయవాడలో జరపాలని నిర్ణయించారట. అందునా ఇది మహేష్‌కి సిల్వర్‌ జూబ్లీ చిత్రం కావడంతో ఆ వేడుకలను కూడా మహేష్‌ ఎంతో ఇష్టపడే విజయవాడలోనే జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రతి చిత్రానికి ఇలా తెలంగాణ, ఆంధ్రా రెంటిని కవర్‌ చేస్తే ప్రేక్షకుల్లో లేనిపోని అపోహలు రాకుండా చేయడానికి వీలవుతుంది. 

Mahesh Babu Follows Sentiment for Maharshi:

Maharshi Covers 2 telugu States
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs