Advertisement
Google Ads BL

అసలు ‘గ్యాంగ్ లీడర్’ మహేష్ అంట!


‘జెర్సీ’ సినిమా సక్సెస్ తరువాత నాని ఫుల్ స్వింగ్ లో చేస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా కథ బయటకు వచ్చింది. ఇందులో నలుగురు మహిళలు, ఓ విలన్ వుంటారని, నాని రచయితగా నటిస్తున్నారని, ఆ మహిళల తరుపున వారికి న్యాయం చేయడానికి రంగంలోకి దిగుతాడని వినిపిస్తోంది.

Advertisement
CJ Advs

అయితే నిజానికి ఇది మహేష్ తో చేద్దాం అనుకున్న కథ అంట. అప్పటిలో విక్రమ్ మహేష్ తో ఓ సినిమా చేద్దాం అనుకున్నాడు కదా అది ఇదే అంట. దీన్ని అశ్వనీదత్ నిర్మిద్దాం అనుకున్నాడు. అందులో విలన్ పాత్రను చాలా హై రేంజ్ లో తయారుచేసారట. కానీ మహేష్ బాబు ఒప్పుకోలేదు. అందుకే ఇప్పుడు ఆ కథనే నానితో చేస్తున్నారు. అందుకోసమే అశ్వనీదత్ కు భారీగా కాంపన్ సేషన్ కూడా ఇచ్చారని టాక్. 

ఇప్పుడు ఆ విలన్ పాత్రను ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ చేస్తున్నాడు. సినిమా స్టార్టింగ్ లోనే నలుగురు మహిళల మర్డర్ ఎపిసోడ్ వుంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

Mahesh Babu is the First Gang Leader:

Mahesh Babu Rejected Gang Leader Story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs