మన సెలబ్రిటీస్ లైఫ్ లో సోషల్ మీడియా కూడా ఒక పార్ట్ అయిపోయింది. తమ సినిమాల ప్రమోషన్స్ దగ్గర నుండి వేరే సినిమాల గురించి మాట్లాడడం వరకు అంతా సోషల్ మీడియానే ఒక ప్లాట్ ఫామ్ గా ఎంచుకున్నారు. ప్రధాన మంత్రి సైతం తన సోషల్ మీడియా అకౌంట్ ని యాక్టీవ్ గా ఉంచుకుంటున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఇది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అని.
బాలీవుడ్ స్టార్స్ కూడా సోషల్ మీడియా తెగ వాడేస్తున్నారు. అలానే మన టాలీవుడ్ స్టార్స్ కూడా. ఇందులో సూపర్ స్టార్ మహేష్ ముందు ఉన్నాడు. మహేష్ ఏకంగా తనకంటూ సపరేట్ టీమ్‌ని ఏర్పాటు చేసుకుని వారికి భారీ మొత్తం చెల్లిస్తూ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ యాక్టివ్‌గా వుండేట్టు చూసుకుంటున్నాడు. ‘స్పైడర్’ టైమ్‌లో సరైన టీమ్ లేక చాలా ఇబ్బంది పడ్డ మహేష్ వెంటనే తన సోషల్ మీడియా యాక్టివిటీని పెంచాడు.
‘భరత్ అనే నేను’ ఒకింత అంత సక్సెస్ అవ్వడానికి కారణం మహేష్ టీమే. అందుకే ఇప్పుడు ‘మహర్షి’ చిత్రానికి కూడా మహేష్ టీమ్ దడదడలాడించేస్తోంది. ఈ చిత్రానికి సోషల్ మీడియాలో ఎదో ఒక రకంగా బజ్ క్రియేట్ చేస్తున్నారు. మాస్ లో ఎంతవరకు ఆకట్టుకుంటుంది అని పక్కన పెడితే....యూత్ లో... ఏ సెంటర్స్ ఆడియన్స్‌ని మాత్రం బాగానే ఆకర్షిస్తోంది. మే 1 న ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది.