Advertisement
Google Ads BL

సమంత, చైతు సినిమాకి భలే టైటిల్!


పెళ్లికి ముందు ఇద్దరు కలిసి నటిస్తే... ఆ క్రేజ్ మాములుగా ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత ఆ జంట గనక సినిమాలో కలిసి కనబడితే.. ప్రేక్షకులకు కన్నుల పండుగే. మరి అలా సినిమాల్లో కలిసి కనబడి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన జంట ఎవరో కాదు.. టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య - సమంతలు. పెళ్ళికి ముందు మూడు సినిమాలు. అందులో రెండు హిట్స్. ఒకటి ప్లాప్. పెళ్లి తర్వాత ఒక సినిమాలో కలిసి నటిస్తే.. ఆ సినిమా సూపర్ హిట్. రీసెంట్ గా మజిలీ సినిమాలో చైతు -సామ్ లు కలిసి నటించారు. ఆ సినిమాని ప్రేక్షకుల ఏ రేంజ్ లో ఆదరించారో... ఆ సినిమా కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఇక మరోమారు ఆ జంట కలిసి నటిస్తే.. ఆసినిమాకి ఆటోమాటిక్ గా భారీ క్రేజ్ రావడం ఖాయం. మజిలీ సినిమా మొదలైనప్పుడే చైతు - సామ్ జంటగా నటిస్తుంది అంటే.. ఆ సినిమాకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. మరి తాజాగా చైతు, సమంతల జంట మరో మూవీలో కలిసి నటించబోతున్నారనే న్యూస్ ఈమధ్యకాలంలో వినబడుతుంది. అదికూడా RX 100 మూవీ డైరెక్టర్, సమంత అక్కినేనితో, బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడి కట్టించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. అందుకే ఇప్పుడు చైతుతో సినిమా కోసం ట్రై చేస్తున్న అజయ్ భూపతి ఆ సినిమాలో మొదటి నుండి అనుకున్నట్లుగా సమంతనే హీరోయిన్ గా తీసుకోబోతున్నాడట. 

ఇక మహాసముద్రం టైటిల్ తో చైతుతో అజయ్ తియ్యబోయే సినిమాలో నాగ చైతన్య పోలీసాఫీసర్ గా కనిపిస్తాడట. ఇక మహాసముద్రం టైటిల్ లో మహా అనేది హీరోయిన్ పేరట. ఇక ఆ మహా క్యారెక్టర్ కి సమంత అయితే బావుంటుందని చెప్పాడట. మహాసముద్రం సినిమా కూడా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుండడంతో....ఆ బలమైన పాత్ర సమంత చేస్తేనే బావుంటుందని డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. మరి ఎలాగూ మజిలీతో సూపర్ హిట్ కొట్టిన చైతు- సామ్ లు మరోసారి ప్రేక్షకుల కోసం నటించడం ఖాయమనే మాట వినబడుతుంది.

Again Samantha and Naga Chaitanya Combo:

Naga Chaitanya turns into a cop for Ajay Bhupathi’s ‘Mahasamudram’?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs