టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్‌లో లో ప్రోఫైల్ మెయిన్‌టెయిన్ చేసే దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ఈయనకు నేటి స్టార్ దర్శకులతో సరిపడా టాలెంట్ ఉన్నా కూడా అతి పెద్ద బ్రేక్ రాకపోవడం వల్ల కెరీర్‌స్లోగా ఉంది. కానీ ఈయనను ఇంటెలిజెంట్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ అని పిలవడంలో ఎలాంటి సందేహం లేదు. ‘అష్టాచెమ్మా., అంతకు ముందు ఆ తర్వాత, గోల్కోండ హైస్కూల్, సమ్మోహనం, జెంటిల్‌మేన్’ ఇలా యాప్ట్ టైటిల్స్‌తో తన సత్తా చాటుతూనే ఉన్నాడు. ఇంతకాలానికి ఆయనకు సరైన బ్రేక్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను నటునిగా పరిచయం చేసిన నాని, సమ్మోహనంతో హిట్ ఇచ్చిన సుధీర్‌బాబులతో కలిసి దిల్‌రాజు బేనర్‌లో చిత్రం అనగానే ఇదేదో ఇంద్రగంటికి ఏనాటి నుంచో వేచిచూస్తున్న బ్లాక్‌బస్టర్‌ని అందిస్తుందా? అనే నమ్మకం కలుగుతోంది.
ఇక ఇందులో సుధీర్‌బాబు పోలీస్ ఆఫీసర్‌గా, నాని విలన్‌గా నటిస్తుండగా, సుధీర్‌బాబు సరసన గతంలో నానితో కలిసి నటించిన నివేదాథామస్, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’లో నటించిన ఆదితీరావు హైదరీ, నాని సరసన నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ టైటిల్ ఏదో డబ్బింగ్ చిత్రం టైటిల్ అని ఫీల్ తెస్తున్న టైంలో విచిత్రంగా ఈ చిత్రానికి ‘వి’ అనే అక్షరాన్ని టైటిల్‌గా పెట్టనున్నారని అంటున్నారు. ‘వి’ అంటే విక్టరీనా? లేక వెరైటీ?నా అనేది పక్కనపెడితే ఇలా సింగిల్ లెటర్‌తో తెలుగులో చిత్రాలు అరుదుగా మాత్రమే వచ్చాయి. కన్నడ స్టార్ ఉపేంద్ర నాడు ‘ఎ’ టైటిల్‌తో ఓ చిత్రం చేశాడు. ఆ తర్వాత అసలు టైటిల్ లేకుండా కూడా ప్రయోగం చేశాడు.
ఇక దిల్‌రాజు ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఎఫ్ 2’ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఇక నాని సబ్జెక్ట్‌లతోనే కాదు టైటిల్స్‌తో కూడా మ్యాజిక్ చేయడం తెలిసిందే. ఆయన మొదటి సారి నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం టైటిల్ ‘అ’ కావడం విశేషం. మొత్తానికి ఐడియా ఎవరిదైనా సరే.. ‘వి’ అనే టైటిల్‌నే ఫిక్స్ చేస్తే టైటిల్‌తోనే క్రేజ్ రావడం ఖాయం. ఇక ‘వి’కి కింద ఇచ్చే ఉపశీర్షిక అయినా సినిమా ఏ జోనర్‌లో సాగుతుందో అనే హింట్‌ని ఇస్తుందా? లేదా? అనేది చూడాలి. మొత్తానికి నాని, దిల్‌రాజు, ఇంద్రగంటిల చిత్రం అంటే క్రేజ్ మాత్రం బాగా హై లెవల్‌లోనే ఉందని చెప్పాలి.