‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్ర చేసి అందరి మనుసులో దోచుకున్న సత్యరాజ్ తమిళంలో ఒకప్పుడు రెబెల్ స్టార్ గా ఒక వెలుగు వెలిగారు. అప్పట్లోనే ఆయన హీరోగా చేస్తున్నప్పుడు 5 కోట్ల పారితోషికం అందుకోవడం విశేషం. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం స్టార్ట్ చేసాడు.
తమిళంలో, తెలుగులో వరస సినిమాలతో బిజీ అయిపోయిన సత్యరాజ్ ప్రాధాన్యత కలిగిన కీలకమైన పాత్రలను అంగీకరిస్తూ వెళుతున్నారు. రీసెంట్ గా ఆయన జెర్సీ సినిమాలో మంచి గుర్తింపు ఉండే పాత్ర చేసాడు. ప్రస్తుతం ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయిపోయాడు. ఈనేపధ్యంలో ఆయన తన పాత్ర ప్రాధాన్యతను బట్టి మొత్తంగా మాట్లాడుకుంటే 2 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట.
రోజులవారీగా అయితే రోజుకి 3 నుంచి 5 లక్షలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ప్రొడ్యూసర్స్ అయితే ఆయన అడిగినంత ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆయనకు బాగా డిమాండ్ ఉంది.